పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లిన హవాయి దీవులు(Hawaiian Islands) ఇప్పుడు మరుభూమిగా మారిపోయింది. శతాబ్దాలుగా పర్యాటక నగరంగా భాసిల్లిన ఆ ద్వీపం ఇప్పుడు రక్తాశ్రవులు కారుస్తోంది. ఎక్కడ చూసినా కాలిన మృతదేహాలే(Dead Bodies) కనిపిస్తున్నాయి. దగ్ధమైన భవంతుల మొండి గోడలు మౌనంగా రోదిస్తున్నాయి. అంతటా హృదయ విదారక దృశ్యాలే గోచరమవుతున్నాయి. అమెరికా హవాయి దీవుల్లో ఉన్న లహైనా రిసార్ట్(Lahaina Resort) నగరంలో కార్చిచ్చు పెను విపత్తును సృష్టించింది. 67 మంది నిండు ప్రాణాలను బలితీసుకుంది.

హవాయి ద్వీపాలలో ఒకటైన మౌయి దీవిలో(island of Maui) ఉన్న హైనా పట్టణంలో గత మంగళవారం రాత్రి కార్చిచ్చు మొదలయ్యింది. అగ్నికి వాయువు తోడైనట్టుగా సుదూరంలో ఏర్పడిన హరికేన్‌ ప్రభావంతో బలమైన ఈదురుగాలులు కార్చిచ్చును ఎగదోశాయి. క్షణాల్లో మంటలు పట్టణమంతా వ్యాపించాయి. జరుగుతున్నదేమిటో తెలుసుకునేలోపు మంటలు చుట్టుముట్టాయి. స్థానిక ప్రజలు ప్రాణాలను గుప్పిటపెట్టుకుని పరుగులు తీశారు. రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ఎంతో శ్రమించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వేల సంఖ్యలో నివాసాలను, ఇతర భవనాలను కార్చిచ్చు కాల్చి బూడిద చేసింది. రోడ్డు మీద పార్క్‌ చేసిన వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. మూగజీవులెన్నో అగ్నికి ఆహుతయ్యాయి. వందల సంఖ్యలో పిల్లులు, ఇతర జంతువులు మంటల్లో మాడిమపైపోయాయి. కాలిపోయి కూలిన భవనాల శిథిలాల కింద మరింత మంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అనుమానం నిజం కావద్దని కోరుకుందాం! దావానలం వేలాది మందిని నిరాశ్రయులుగా మార్చేసింది. కార్చిచ్చు గురించి ముందుగా ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అగ్నికీలలు నివాసాల దగ్గరకు చేరే ముందు హవాయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఎలాంటి వార్నింగ్‌ సైరన్లు మోగించలేదని తెలిసింది. టీవీలు, రేడియో స్టేషన్లు, మొబైల్‌ ఫోన్ల ద్వారా అప్రమత్తం చేశామని అధికారులు చెప్పుకొస్తున్నాయి. కార్చిచ్చు కారణంగా చాలా చోట్ల విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. మొబైల్‌ సిగ్నళ్లు కట్‌ అయ్యాయి. దాంతో ప్రజలకు ఈ సందేశాలు చేరలేదు. ఈ కారణం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది.

Updated On 12 Aug 2023 4:42 AM GMT
Ehatv

Ehatv

Next Story