హైదర్ షా కోటే ప్రధాన రహదారిపై సన్ సిటీ వద్ద ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి కారు దూసుకెళ్లింది.

Terrible accident took place today on the Hyder Shah Kote main road
హైదర్ షా కోటే(Hyder Shah Kote) ప్రధాన రహదారిపై సన్ సిటీ(Sun City) వద్ద ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం(Accident) జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి కారు దూసుకెళ్లింది. కారు(Car) వేగంగా ఢీకొట్టడంతో బాధితులు సమీపంలోని ముళ్ల పొదల్లోకి ఎగిరిపడ్డారు. దీంతో ఓ తల్లి, బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. మృతులను అనురాధ(Anuradha), మమత(Mamata)గా గుర్తించారు. బాధితులు శాంతి నగర్(Shanthi Nagar Colony) కాలనీకి చెందిన వారు కాగా.. మార్నింగ్ వాక్(Morning Walk) కు వెళ్లగా ఈ ఘటన జరిగింది. నార్సింగి పోలీసులు(Narsingi Police) సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వాట్సాప్(Whatsapp)లో హల్‌చల్ చేస్తున్న వీడియోలో ఓ కారు పొదల్లోకి దూసుకెళ్లింది. కారు ముందు గ్లాస్ పగిలినట్లుగా ఉంది. వాహనం లోపల స్పోర్ట్స్ బ్యాగ్(Sports Bag) కనిపిస్తుంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
