అభిషేక్ ఘోసల్కర్, మారిస్ నోరోన్హా కార్యాలయాలు పక్కన పక్కనే ఉంటాయి. స్థానిక రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించే
మహారాష్ట్రలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శివసేన యూబీటీ వర్గానికి చెందిన అభిషేక్ ఘోసాల్కర్ అనే నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమ్‌లో పాల్గొనేందుకు ఆహ్వానించిన మారిస్ నోరాన్హా అనే వ్యక్తి అభిషేక్ ఘోసాల్కర్‌ను తుపాకీతో కాల్చి చంపేశాడు. చంపేసిన తరువాత తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని దహిసార్ ప్రాంతంలో ఎమ్‌హెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్ వినోద్ ఘోసాల్కర్ కుమారుడు అభిషేక్. మారిస్‌తో అతడికి విభేదాలు ఉండేవి. ఇటీవలే వారు రాజీ పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో మారిస్, అభిషేక్‌ను ఫైస్‌బుక్‌లో లైవ్‌స్ట్రీమ్ చేస్తున్న కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించాడు. నిజమేనని నమ్మి.. లైమ్ స్ట్రీమ్ కోసం వెళ్లగా.. మారిస్ ఈ దారుణానికి తెగబడ్డాడు.
మారిస్ .. ఘోసల్కర్‌పై మూడుసార్లు కాల్చాడు. దీని తర్వాత మారిస్ తను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మౌరిస్ నోరోన్హా బోరివలి వెస్ట్ నివాసి అని.. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆకాంక్షను కలిగి ఉన్న సామాజిక కార్యకర్త అని పేర్కొన్నారు.మారిస్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పలువురు రాజకీయ నాయకులతో అనేక చిత్రాలను పంచుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అభిషేక్ ఘోసల్కర్, మారిస్ నోరోన్హా కార్యాలయాలు పక్కన పక్కనే ఉంటాయి. స్థానిక రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించే విషయమై వీరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికులు తెలిపారు. ఇటీవలే ఏక్‌నాథ్ శిండే వర్గానికి చెందిన మహేశ్ గైక్వాడ్‌పై ఓ బీజేపీ ఎమ్మెల్యే కాల్పులకు తెగబడిన ఘటన వైరల్‌గా మారింది. ఈ ఘటన మరవక ముందే అభిషేక్ హత్య జరగడం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.