ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సొర్లాం వెంకట విద్యాసాగర్‌(Venkata Vidyasagar)తో స్వప్నకు పరిచయం ఉంది.

సంగారెడ్డి జిల్లాలో ప్రియుడితో వెళ్లిపోయేందుకు భర్త, ముగ్గురు పిల్లలను చంపాలనుకుంది ఓ కామాంధురాలు. పెరుగులో విషయం కలిపి పెట్టగా ముగ్గురు పిల్లలు పెరుగన్నం తిని చనిపోయారు. పెరుగు అన్నం తినని భర్త బతికి బయటపడ్డాడు. తనకు ఏమీ తెలియనట్లు నాటకమాడింది ఆ కామలేడి. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు రావడంతో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఇది మరవక మందు మరో కామలేడి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపించింది.

భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా కేంద్రంలోని జగదీశ్‌ కాలనీ(Jagadesh Colony)లో పార్థసారథి-స్వప్న(Parthasarathi-Swapa) కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏటపాక మండలం నెల్లిపాక(Nellipaka)లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సొర్లాం వెంకట విద్యాసాగర్‌(Venkata Vidyasagar)తో స్వప్నకు పరిచయం ఉంది. స్వప్న తల్లి ఇంటి దగ్గర వెంకట విద్యాసాగర్‌ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండగా 2016లో స్వప్నకు పరిచయమయ్యాడు. పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం పార్ధసారథికి తెలియడంతో దంపతుల చాలా సార్లు గొడవలు జరిగాయి. పార్ధసారథి ఎన్ని సార్లు మందలించినా స్వప్న తన సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇది ఇలా ఉండగా స్వప్న భర్త పార్థసారథికి మహబూబాబాద్‌(Mahabubnagar) జిల్లా దంతాలపల్లి ఎంజేపీ(MJP)లో హెల్త్‌ సూపర్‌వైజర్‌ ఉద్యోగం వచ్చింది. ఫిబ్రవరి నుంచి అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. సెలవులు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి వెళ్లేవాడు. అప్పుడప్పుడు స్వప్నకు వీడియో కాల్‌ చేసి మాట్లాడేవాడు. పార్ధసారథిని ఎలాగైనా అంతమొందించాలని స్వప్న తన ప్రియుడు వెంకట విద్యాసాగర్‌కు చెప్పింది. దీంతో వెంకట విద్యాసాగర్‌.. కొత్తగూడెం మండలానికి చెందిన తెలుగూరి వినయ్‌కుమార్‌(Vinay kumar), శివశంకర్‌(Shiva Shankar), ఏటపాక మండలానికి చెందిన వంశీ(Vamshi)తో మాట్లాడి పార్ధసారథిని హత్య చేయించాలని పథకం రచించించారు. రూ.5 లక్షల సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఉగాది, రంజాన్ సెలవులు రావడంతో పార్థసారథి కొత్తగూడెం వచ్చారు. అక్కడ స్వప్న, పార్థసారథి షాపింగ్‌ చేసి.. తన బైక్‌పై పార్థసారథి దంతాలపల్లి వెళ్తుండగా.. స్వప్న తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది. దీంతో సుపారీ గ్యాంగ్ ఓ కారును రెంట్‌కు తీసుకొని పార్థసారథిని వెంబండించి శనిగపురం శివారు బోరింగ్‌తండా దగ్గరకు రాగానే అడ్డుకొని పార్థసారథిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు చాకచక్యంగా విచారించగా తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య స్వప్ననే చంపించిందని తేలింది. దీంతో స్వప్న, ప్రియుడు వెంకట విద్యాసాగర్‌ను అరెస్ట్‌ చేయగా వినయ్‌కుమార్‌, శివశంకర్‌, వంశీ పరారీలో ఉన్నారు. ఈ కేసు విచారణలో ప్రతిభ కనబర్చిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.

ehatv

ehatv

Next Story