☰
✕
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో విషాద ఘటన చోటుచేసుకుంది.
x
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్సై ఏజీఎస్ మూర్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఆయన.. ఇటీవల పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ehatv
Next Story