సులభంగా డబ్బు సంపాదించాలని తమిళనాడులో ఒక యువ టెక్కీ ఏకంగా ఇంట్లో నే గంజాయి మొక్కల్ని పెంచడం మొదలు పెట్టాడు . చుట్టుపక్కల వారు వాసనా కొత్తగా రావటంతో ఏమైఉంటుందో అనుకున్నరే తప్ప గంజాయి వాసనా అని తెలుసుకోలేకపోయారు . తీరా పోలీసులకు కబురు  తెలిసి సోదాలు జరుపగా సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంటి బాల్కనీ లో గంజాయి పెంచటం చూసి అవాక్కయ్యారు . తమిళనాడు లోనిప్రైవేట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోన్న శక్తివేల్ మాడంబాక్కం ప్రాంతంలో […]

సులభంగా డబ్బు సంపాదించాలని తమిళనాడులో ఒక యువ టెక్కీ ఏకంగా ఇంట్లో నే గంజాయి మొక్కల్ని పెంచడం మొదలు పెట్టాడు . చుట్టుపక్కల వారు వాసనా కొత్తగా రావటంతో ఏమైఉంటుందో అనుకున్నరే తప్ప గంజాయి వాసనా అని తెలుసుకోలేకపోయారు . తీరా పోలీసులకు కబురు తెలిసి సోదాలు జరుపగా సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంటి బాల్కనీ లో గంజాయి పెంచటం చూసి అవాక్కయ్యారు .

తమిళనాడు లోనిప్రైవేట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోన్న శక్తివేల్ మాడంబాక్కం ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలని బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా క్రిప్టో లో మనీ ఇన్వెస్ట్ చేసాడు . అనుకోనివిధమైన భారీ నష్టాన్ని చూసాడు . డార్క్ వెబ్సైట్ ,బ్లాక్చైన్ టెక్నాలజీ లాంటి కొత్త పోకడల ద్వారా ఈజీ మనీ ఎలా సంపాదించాలో కొన్ని ప్రణాళికలు రూపొందించుకున్నాడు. గంజాయి తో మనీ ఎక్కువ సంపాదించగలను అని డిసైడ్ అయ్యి గంజాయి మొక్కల పెంపకానికి కావాల్సిన పరికరాలను సైతం డార్క్ వెబ్సైట్ ద్వారా తెప్పించుకొని ఏకంగా ఇంటి గార్డెన్ లో గంజాయి సాగు మొదలుపెట్టాడు . గంజాయిని ఎప్పుడు అమ్మకానికి తీయాలి,ఎలా సాగు చేయాలి అనేవి అన్ని కూడా ఇంటర్నెట్ సహాయం తో నేర్చుకున్నాడు .

గంజాయి పూర్తిగా తయారు అయ్యాక ఎండబెట్టి వాటి అమ్మకానికి సిద్ధం చేసాడు. ఆన్లైన్ ద్వారా వీటిని ఎలా అమ్మాలో తెలుసుకున్న శక్తివేల్ మరో ముగ్గురితో నరేంద్రకుమార్,శ్రీకాంత్,శ్యాంసుందర్ సహాయం తో పబ్బలు,స్కూల్స్,కాలేజీలకు వెళ్లే యువతను టార్గెట్ చేసి ట్రాప్ చేసేవాళ్ళు. రహస్యం గా వాళ్లకి గంజాయి అమ్మకాన్ని జరిపేవాళ్లు . గత నాలుగు సంవత్సరాలనుండి ఈ పని చేస్తున్నాడు శక్తి వెల్. ఈ రహస్య సమాచారం కాస్త పోలిసుల వరకు వెళ్లేసరికి అసలు గుట్టు బయటపడింది . ఇంటికి వెళ్లిన పోలీసులకు 3 కిలోల గంజాయి,10కి పైగా గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.

Updated On 4 March 2023 6:55 AM GMT
Ehatv

Ehatv

Next Story