విశాఖలో గుర్తు తెలియని వ్యక్తి తహసీల్దార్‌పై దాడి చేశాడు. అర్ధరాత్రి సమయంలో ఈ దాడి జరగడంతో ఆయన మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tahsildar Ramanaiah Killed By Unknown Person In Kommadi At Visakhapatnam
విశాఖ(Visakhapatnam)లో గుర్తు తెలియని వ్యక్తి తహసీల్దార్‌పై దాడి చేశాడు. అర్ధరాత్రి సమయంలో ఈ దాడి జరగడంతో ఆయన మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొమ్మాది(Kommadhi)లోని చరణ్ క్యాస్టల్ అపార్ట్‌మెంట్‌లో తహసీల్దార్ రమణయ్య(Tahsildar Ramanaiah) నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అపార్ట్‌మెంట్ దగ్గరకు వచ్చాడు. అపార్ట్‌మెంట్ దగ్గర ఉన్న రమణయ్యతో సదరు వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్(Iron Rod)తో రమణయ్యపై దాడి చేశాడు. దీంతో, తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు.
అపార్ట్‌మెంట్‌వాసులు దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ తప్పించుకున్నాడు. రెండు రోజుల క్రితం వరకు రమణయ్య విశాఖ రూరల్ తహశీల్దార్‌గా పనిచేశారు. విశాఖ రూరల్(Vishaka Rural) చినగదిలి తహసీల్దార్‌గా ఉన్న సనపల రమణయ్య ఎన్నికల నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని బంటుపల్లికి బదిలీ అయ్యారు. సిటీ పోలీసు కమిషనర్ రవిశంకర్(Ravi Shankar) ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. రమణయ్య హత్య కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను విశాఖ పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో నిందితుడి కోసం 12 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
