ఏలూరులో ఓ ఇంజినీరింగ్ విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు వైఎస్ఆర్ కాలనీకి చెందిన కలిపిండి మేఘన (23) రామచంద్ర కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. తండ్రి తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాట్నాలకుంటలో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి ఇంటికొచ్చిన తల్లిదండ్రులు..

Suspicious death of an engineering student in Eluru
ఏలూరు(Eluru)లో ఓ ఇంజినీరింగ్ విద్యార్ధి(Engineering Student)ని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు వైఎస్ఆర్ కాలనీ(YSR Colony)కి చెందిన కలిపిండి మేఘన(Meghana) (23) రామచంద్ర కళాశాల(Ramachandra College)లో బీటెక్ తృతీయ సంవత్సరం(B.tech Second Year) చదువుతోంది. తండ్రి తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆదివారం రాట్నాలకుంటలో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి ఇంటికొచ్చిన తల్లిదండ్రులు.. మేఘన మెడకు చున్నీతో నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. విద్యార్థిని మృతికి కారణాలు తెలియాల్సివుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వచ్చి మేఘన మృతదేహాన్ని పరిశీలించారు. రూరల్ సీఐ ఆది ప్రసాద్(Aadi Prasad) ఆదేశాల మేరకు అనుమానాస్పద మృతి(Suspicious death)గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై లక్ష్మణబాబు(Laxmana Babu) తెలిపారు.
