ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో వీధి కుక్కలు భీభత్సం(Stray Dogs) సృష్టించాయి. రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్‌(Maharaj Gunj)లో వీధికుక్కలు 11 ఏళ్ల బాలుడిపై దాడి చేసి చంపాయి. బాలుడిని ఆదర్శ్ శర్మ(Adarsh Sharma)గా గుర్తించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాలుడి మృతదేహాన్ని నెహ్రూనగర్ వార్డులో స్థానికులు గుర్తించారు. మహారాజ్‌గంజ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రవి రాయ్(Ravi Roy) తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు ఒంటరిగా ఇంటి నుండి బయటకు వెళ్లగా.. ఈ హృదయ విదారక సంఘటన జరిగిందని రాయ్ చెప్పారు. […]

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో వీధి కుక్కలు భీభత్సం(Stray Dogs) సృష్టించాయి. రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్‌(Maharaj Gunj)లో వీధికుక్కలు 11 ఏళ్ల బాలుడిపై దాడి చేసి చంపాయి. బాలుడిని ఆదర్శ్ శర్మ(Adarsh Sharma)గా గుర్తించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాలుడి మృతదేహాన్ని నెహ్రూనగర్ వార్డులో స్థానికులు గుర్తించారు. మహారాజ్‌గంజ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రవి రాయ్(Ravi Roy) తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు ఒంటరిగా ఇంటి నుండి బయటకు వెళ్లగా.. ఈ హృదయ విదారక సంఘటన జరిగిందని రాయ్ చెప్పారు. బాలుడి ముఖం, కుడిచేతిపై లోతైన గాట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గాయాల‌ను చూస్తుంటే కుక్కల దవడల నుంచి విడిపించుకునేందుకు చిన్నారి తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆ ప్రాంతంలో కలకలం రేగింది. పోలీసులు(Police), జిల్లా అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధికుక్కల బెడదను అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైందంటున్నారు. బాలుడు తరచూ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లేవాడని అంటున్నారు. చాలా సార్లు ఆదర్శ్ బ‌య‌ట‌ తిరుగుతుండ‌గా.. పొరుగువ్య‌క్తి అతన్ని ఇంటి వ‌ద్ద దింపేవాడ‌ని పేర్కొంటున్నారు. సోమవారం రాత్రి కూడా ఆద‌ర్శ్‌ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. వెంట‌నే పోలీసులకు సమాచారం అందించాలని నిర్ణయించుకున్నారు. బాలుడి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా.. ఓ వ్య‌క్తి మృతి చెందినట్లు సమాచారం అందించాడు. అనంతరం మృతదేహాన్ని గుర్తించారు.

Updated On 12 April 2023 12:02 AM GMT
Yagnik

Yagnik

Next Story