ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. 18 మంది మృతి చెందారు. సమాచారం ప్రకారం.. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బీహార్‌లోని శివగఢ్ నుండి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సు.. బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిర్‌స్ట్రిప్‌పై ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు, ట్యాంకర్ రెండూ ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి సహా 18 మంది మృతి చెందారు. దాదాపు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.
#UPDATE | 18 people died after a double-decker bus going from Bihar to Delhi, hit a milk tanker at around 05:15 AM on the Agra-Lucknow Expressway under Behtamujawar PS area. On receiving the information of the incident, police reached the spot, took out all the injured and…
— ANI (@ANI) July 10, 2024