నార్సింగీలో విషాదం చోటుచేసుకుంది. బావిలో ఆరు సంవ‌త్స‌రాల బాలుడి మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. వివ‌రాళ్లోకెళితే.. ఆరు సంవత్సరాల బాలుడు బన్నీ కిరాణా కొట్టుకు వెళ్లి

నార్సింగీ(Narsingi)లో విషాదం చోటుచేసుకుంది. బావిలో ఆరు సంవ‌త్స‌రాల బాలుడి మృత‌దేహాన్ని(Dead Body) పోలీసులు(Police) గుర్తించారు. వివ‌రాళ్లోకెళితే.. ఆరు సంవత్సరాల బాలుడు బన్నీ(Bunny) కిరాణా కొట్టుకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు(Missing Case) నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు. ఈ క్ర‌మంలోనే ఓ పాడుబడ్డ బావిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో నీళ్లు తోడేసి ఎన్డీఆర్ఎఫ్‌(NDRF) బృందాలు బాలుడి మృతదేహాన్ని బయటకు తీశాయి. అయితే బాలుడు ప్ర‌మాద‌వశాత్తు బావిలో ప‌డ్డాడా..? లేదా ఎవ‌రైనా హ‌త్య చేశారా.? అన్న‌ది తెలియాల్సివుంది.

Updated On 15 Aug 2023 10:22 PM GMT
Yagnik

Yagnik

Next Story