అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు కడప నుండి తిరుపతి వెళ్తుండగా లారీ ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం సంభ‌వించింది.

అన్నమయ్య జిల్లా(Annamayya District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు కడప(Kadapa) నుండి తిరుపతి(Tirupati) వెళ్తుండగా లారీ ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయ‌ప‌డిన‌ మరో ముగ్గురు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి(Rajampet Govt Hospital)లో చికిత్స‌పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది. పుల్లంపేట(Pullampeta) సమీపంలోని క్రాస్ వద్ద జాతీయ రహదారి(National Highway)పై కడప నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు(RTC Bus)ను ఎదురుగా వచ్చిన లారీ(Lorry) ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ అతివేగమే కారణమని స్థానికులు, పోలీసులు(Police) తెలిపారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

అన్నమయ్య జిల్లా పుల్లంపేట వద్ద ఆర్టీసీ బస్సుకు జరిగిన ప్రమాదంలో పలువురు మృతిచెందిన ఘటనపై సీఎం జగన్‌(CM Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలవాలన్నారు. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా(Exgratia) ఇవ్వాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు.. స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున సహాయం చేయాలన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం(CM) తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

రోడ్డు ప్రమాదంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.

Updated On 22 July 2023 8:26 PM GMT
Yagnik

Yagnik

Next Story