ఢిల్లీ ఎన్‌సీఆర్ షాహదారా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. షాహదారాలోని స్థానిక ఫార్ష్ బజార్ ప్రాంతంలో మోమోస్ చట్నీని అదనంగా అడిగినందుకు ఓ యువకుడిపై దుకాణదారుడు కత్తితో దాడి చేశాడు.

Shopkeeper Attacks Customer With Knife After Asking For Extra Chutney For Momos
ఢిల్లీ ఎన్‌సీఆర్ షాహదారా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. షాహదారాలోని స్థానిక ఫార్ష్ బజార్ ప్రాంతంలో మోమోస్(Momos) చట్నీ(Chutney)ని అదనంగా అడిగినందుకు ఓ యువకుడిపై దుకాణదారుడు(Shopkeeper) కత్తితో దాడి చేశాడు. బాధితుడు సందీప్(Sandeep)ను నిందితుడు కత్తితో పలుమార్లు పొడిచాడు. దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు అతడు అక్కడి నుంచి పరుగెత్తడం ప్రారంభించాడు. దీంతో ప్రజలు అతడి ప్రాణాలను కాపాడారు.
ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గాయాలపాతైన బాధితుడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై ఫార్ష్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి నిందితుడు మోమోజ్ వాలేను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూ సంజయ్ అమర్ కాలనీ(New Sanjay Amar Colony)లో సందీప్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి తన స్నేహితుడు రవి(Ravi)తో కలిసి బర్గర్లు(Burger), మోమో(Momos)లు తినేందుకు వీధి వ్యాపారి వద్దకు వెళ్లాడు. మోమోస్ తింటూ సందీప్ షాప్‌కీపర్ వికాస్(Vikas)ని రెండోసారి చట్నీ అడిగాడు. దీంతో అతడు సందీప్‌పై కత్తితో దాడి చేశాడు.
