ఖమ్మం(Khammam) జిల్లా మధిర(Madhira) మండలం రాయపట్నం(Rayapatnam) గ్రామంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో శివరాం గోపాల్(Shiram Gopal) అనే వ్యక్తి కన్నబిడ్డలను గొంతు నులిమి చంపాడు. అనంతరం మృత దేహాలను దుప్పట్లో మూటకట్టి(wrapped up) పెట్టాడు. చిన్నారులు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడి చుట్టుపక్కల వెతికినా పిల్లల జాడ కనిపించలేదు.

Father Killed his Own Child
ఖమ్మం(Khammam) జిల్లా మధిర(Madhira) మండలం రాయపట్నం(Rayapatnam) గ్రామంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో శివరాం గోపాల్(Shivaram Gopal) అనే వ్యక్తి కన్నబిడ్డలను గొంతు నులిమి చంపాడు. అనంతరం మృత దేహాలను దుప్పట్లో మూటకట్టి(wrapped up) పెట్టాడు. చిన్నారులు కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడి చుట్టుపక్కల వెతికినా పిల్లల జాడ కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఇంట్లో వెతకగా మూటకట్టిన దుప్పట్లో మృతదేహాలు లభ్యమైనవి. కుటుంబ సభ్యులు హుటాహుటిన పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పిల్లలు మృతిచెందారని వైద్యులు నిర్థారించారు.
కొద్దికాలంగా కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు పడుతున్న శివరాం గోపాల్ పాఠశాల నుంచి ఇద్దరు పిల్లలను ఇంటికి తీసుకువచ్చి చితకబాదాడు. అనంతరం మద్యం మత్తులో ఇద్దరు చిన్నారుల గొంతు నులిమి చంపేశాడు. చిన్నారులు రామకృష్ణ ( 7), ఆరాధ్య (6) ఊపిరాడక కన్నుమూశారు. పిల్లలు మరణించడంతో కన్నతల్లి ఏసుమణి, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తండ్రి శివరాం గోపాల్ పరారీలో ఉన్నాడు. పిల్లల మృతికి కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అంటున్నారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివరాం గోపాల్ పై గతంలో కూడా పలు కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల జైలు శిక్ష అనుభవించి శివరాం బయటికి వచ్చాడు. ఆసుపత్రి ఆవరణలో మృతిచెందిన పిల్లలను భుజంపై వేసుకుని తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఈ ఘటన స్థానికులను సైతం కంటతడి పెట్టిస్తుంది.
