పశువుల గడ్డి కోసుకొచ్చేందుకు పొలానికి వెళ్లిన ఓ రైతుపై(Farmer) పులి(Tiger) దాడి చేసింది. పులి దాడిలో ఆ రైతు అక్కడిక్కడే మృతిచెందాడు. కేరళ(Kerala) రాష్ట్రం వాయునాడులోని వాకేరి ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆ పులని చంపాలని కేరళ ప్రభుత్వం అటవీఅధికారులకు ఆదేశాలు ఇచ్చింది.

పశువుల గడ్డి కోసుకొచ్చేందుకు వెళ్లిన శనివార్ ప్రజీష్(Shanivar Prajeesh) అనే 36 ఏళ్ల రైతుపై పులి దాడి చేసి.. మృతదేహాన్ని కొంత భాగం పులి తినేసింది. ఉదయం వెళ్లిన ప్రజీష్ పొలం నుంచి ఎంత సేపటికీ తిరిగిరాకపోవడంతో కోసం కుటుంబసభ్యులు, బంధువులు వెతకసాగారు. పొలంలో మృతదేహాన్ని గుర్తించారు. ప్రజీష్ ఎడమకాలు, తొడ, తలలో కొంత భాగాన్ని పులి తినింది. ప్రజీష్ మృతదేహాన్ని చూసి స్థానికులు భయభ్రాంతులకుగురయ్యారు. గత శనివారం ఈ సంఘటన చోటు చేసకుంది. పులి దాడిని అటవీశాఖ(Forest Department) అధికారులకు చెప్పడంతో ప్రభుత్వ పెద్దలకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. దీంతో రైతును చంపిన పులిని వెంటనే చంపాలని కేరళ ప్రభుత్వం అటవీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్ ఈటర్‌గా(Man Eater) పులిని గుర్తించామని.. పులిని పట్టుకోలేకపోతే, అది నరమాంస భక్షకుడిగా మారి ఈ ప్రాంతంలో మానవ జీవితానికి ప్రమాదకరంగా మారినందున దానిని చంపాలి అని ఆదేశాలు ఇచ్చింది. మరికొంత మంది రైతులు చనిపోకముందే ఆ పులిని చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రైతుల భయాందోళనలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు, ప్రభుత్వం వివరించింది. 2023 జనవరిలో ఇదే జిల్లాలో 52 ఏళ్ల రైతు పులుల దాడితో మరణించాడు.