అసోంలోని తిన్సుకియా జిల్లాలో మంగళవారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, పది మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఎదురుగా వస్తున్న లారీ.. మ్యాజిక్‌ను ఢీకొట్టినట్లు చెబుతున్నారు.
అసోం(Assam)లోని తిన్సుకియా జిల్లా(Tinsukia District)లో మంగళవారం(Tuesday) అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, పది మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఎదురుగా వస్తున్న లారీ(Lorry).. మ్యాజిక్(Magic)ను ఢీకొట్టినట్లు చెబుతున్నారు. క్షతగాత్రులను టిన్సుకియా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మ్యాజిక్ లో ప్రయాణిస్తున్న వ్యక్తులు మృత్యువాత పడ్డారు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు.
అందిన సమాచారం ప్రకారం.. బాధితులందరూ మంగళవారం అర్థరాత్రి టిన్సుకియా జిల్లాలోని డూమ్‌డుమాలోని వీక్లీ మార్కెట్ నుండి మ్యాజిక్‌లో ఇంటికి తిరిగి వస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) నుంచి వస్తున్న ట్రక్కు కాకో పత్తర్‌లోని బర్దిరాక్ సమీపంలో ముందు నుంచి మ్యాజిక్‌ను ఢీకొట్టింది.
మ్యాజిక్‌లో దాదాపు 15 నుంచి 20 మంది వరకు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం చాలా ఘోరంగా ఉందని.. మ్యాజిక్ వాహనం మొత్తం దెబ్బతిందని ప్రజలు తెలిపారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పది మందికి పైగా గాయపడ్డారు.
క్షతగాత్రులను టిన్సుకియా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు సమాచారం. లారీ డ్రైవర్ మద్యం(Alcohal) మత్తులో ఉన్నాడని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.