ఉత్త‌రాఖాండ్ రాష్ట్రం నైనిటాల్‌లో హర్యానా టూరిస్ట్ బస్సు కాలువలో పడింది. నగరానికి సమీపంలోని నళిని ప్రాంతంలో పర్యాటకులతో నిండి ఉన్న‌ బస్సు లోతైన లోయలో పడిపోయింది. బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఉత్త‌రాఖాండ్(Uttarakhand) రాష్ట్రం నైనిటాల్‌(Nainital)లో హర్యానా టూరిస్ట్ బస్సు(Haryana Tourist Bus) కాలువలో పడింది. నగరానికి సమీపంలోని నళిని ప్రాంతంలో పర్యాటకులతో నిండి ఉన్న‌ బస్సు లోతైన లోయలో పడిపోయింది. బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక దళం బృందాలు ప్ర‌మాద‌స్థ‌లానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను లోయ‌ నుంచి బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ ప్రమాదంలో ఏడు మరణాలు నమోదయ్యాయి. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సులో 32 మంది ఉన్నారు. వీరిలో 25 మందిని తరలించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఎస్పీ ప్రహ్లాద్ నారాయణ్ మీనాతో సహా మొత్తం బృందం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.

హర్యానాలోని పటాన్ హిసార్ గ్రామం షాపూర్‌లోని న్యూ మానవ్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన బస్సు శనివారం ముగ్గురు పిల్లలు స‌హా పాఠశాల సిబ్బందితో నైనిటాల్‌కు వచ్చింది. ఆదివారం రాత్రి పర్యాటకులు తిరిగి వెళ్తున్నారు. బస్సు కలాధుంగి రోడ్డులోని నళిని సమీపంలోకి చేరుకోగానే అకస్మాత్తుగా అదుపు తప్పి దాదాపు 200 అడుగుల లోతున్న గుంతలో పడిపోయింది. బస్సులోని పలువురు ప్రయాణికులు తప్పించుకుని బయట పడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మంగోలి చౌకీ పోలీసులతో సహా ఎస్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక దళం బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. రెస్క్యూ సమయంలో 25 మంది ప్రయాణికులను ర‌క్షించి ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన ప్రయాణికులను విచారించగా బస్సులో 32 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందిందని ఎస్‌ఎస్పీ ప్రహ్లాద్ నారాయణ్ మీనా తెలిపారు. గాయపడిన వారి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు.

Updated On 8 Oct 2023 8:55 PM GMT
Yagnik

Yagnik

Next Story