ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వేగంగా వచ్చిన బొలెరో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది.

Seven dead in road accident in Banda
ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని బందా జిల్లా(Banda District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వేగంగా వచ్చిన బొలెరో(Bolero) రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ(lorry)ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు యంత్రాంగం.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించింది. గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
కమాసిన్(Kamsin) పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలౌసా(Tilausa) గ్రామంలో 13 ఏళ్ల చిన్నారి విద్యుదాఘాతానికి గురైంది. కుటుంబ సభ్యులు బొలెరోలో చిన్నారిని తీసుకుని ఆసుపత్రికి బయలుదేరారు. పరాయ డై సమీపంలోకి రాగానే బొలెరో బ్యాలెన్స్ కోల్పోవడంతో రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, సిహెచ్‌సి(CHC)లో ఒకరు మరణించారని పోలీసు సూపరింటెండెంట్(CP) చెప్పారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్(Truck Driver) అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న స్థానికులు ఈ ఘటనపై పోలీస్ కంట్రోల్ రూం(Police Control Room)కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజల సాయంతో బొలెరోలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద వార్త తెలియగానే మృతుల గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి గురైన చిన్నారిని రక్షించేందుకు ఆస్పత్రికి వెళుతున్నారని.. ఇలా జరుగుతుందని ఊహించలేదని గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.
