పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరి పేట-పర్చూరు జాతీయరహదారిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట ఈవూరవారిపాలెంలో ట్రావెల్స్‌ బస్సును టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు, టిప్పర్‌ పూర్తిగా తగలబడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌, టిప్పర్‌ డ్రైవర్‌, నలుగురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. 32 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ఎనిమిదేళ్ల చిన్నారి ఉంది. గాయపడి వారిని గుంటూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చినగంజాం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు బాపట్ల జిల్లా చినగంజాం మండలం నీలాయపాలెం వాసులుగా పోలీసులు గుర్తించారు. బైపాస్‌ పనులు జరుగుతుండటం, తారురోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవటం వల్ల టిప్పర్‌ లారీ వేగంగా దుసుకువచ్చిందని ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.

కోనసీమ జిల్లాలో వేగంగా వెళ్తున్న బస్సు ట్రాక్టర్‌ను ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని పి గన్నవరం మండల పరిధిలోని ఊడిమూడి గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతులను నూకపల్లి శివ (35), వాసంశెట్టి సూర్య ప్రకాష్ (50), వీరి కట్లయ్య (45), చిలకలపూడి పాండాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు కొత్తపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేశారు.

Updated On 15 May 2024 12:23 AM GMT
Yagnik

Yagnik

Next Story