ఝార్ఖండ్‌లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు

మధ్యప్రదేశ్‌లోని దిండోరిలోని బద్జర్ ఘాట్ వద్ద గురువారం పికప్ వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 14 మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారని వికాస్ మిశ్రా డిండోరి కలెక్టర్ తెలిపారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. బాధిత ప్రజలు ' గోద్ భరై ' కార్యక్రమం నుండి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు వైద్యసేవలు అందించాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. "దిండోరి జిల్లాలో జరిగిన వాహన ప్రమాదంలో 14 మంది మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ పిడుగుపాటు వార్తను తట్టుకునే శక్తిని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.

ఝార్ఖండ్‌లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. జాంతారలోని కాలా ఝరియా రైల్వే స్టేషన్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ప్రాథమికంగా పన్నెండు మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలియగానే వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. కొంతమంది రైల్వే ట్రాక్ దాటుతుండగా అంగా ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. పన్నెండు మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.

Updated On 28 Feb 2024 10:15 PM GMT
Yagnik

Yagnik

Next Story