గంటల్లోనే పెళ్లి(Marriage) ఉంది. ఇల్లంతా బంధువులతో కళకళలాడుతోంది. పెళ్లి కోసం వధువు(Bride) తండ్రి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. కాళ్లు కడిగి కన్యాదానం చేసేందుకు పెళ్లి కూతురు తండ్రి సిద్ధమయ్యాడు. ఇంతలోనే నమ్మలేని వార్త విని ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు ఆ తండ్రి. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకునేందుకు యువతీ, యువకులు ఇంట్లో ఒప్పించే ప్రయత్నం చేస్తారు. దీనికి తల్లిదండ్రులు అంగీకరిస్తే ప్రేమ పెళ్లి జరుగుతుంది. ఇంట్లో ఒప్పుకోకుంటే తల్లిదండ్రులు చూసిన వరుడు లేదా వధువును పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అయితే గంటల్లో పెళ్లి ఉందనగా పెళ్లి కూతురు ప్రియుడితో లేచిపోవడం(Ran Away) సినిమాల్లో చూస్తుంటాం.

గంటల్లోనే పెళ్లి(Marriage) ఉంది. ఇల్లంతా బంధువులతో కళకళలాడుతోంది. పెళ్లి కోసం వధువు(Bride) తండ్రి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. కాళ్లు కడిగి కన్యాదానం చేసేందుకు పెళ్లి కూతురు తండ్రి సిద్ధమయ్యాడు. ఇంతలోనే నమ్మలేని వార్త విని ఆత్మహత్య(suicide) చేసుకున్నాడు ఆ తండ్రి. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకునేందుకు యువతీ, యువకులు ఇంట్లో ఒప్పించే ప్రయత్నం చేస్తారు. దీనికి తల్లిదండ్రులు అంగీకరిస్తే ప్రేమ పెళ్లి జరుగుతుంది. ఇంట్లో ఒప్పుకోకుంటే తల్లిదండ్రులు చూసిన వరుడు లేదా వధువును పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అయితే గంటల్లో పెళ్లి ఉందనగా పెళ్లి కూతురు ప్రియుడితో లేచిపోవడం(Ran Away) సినిమాల్లో చూస్తుంటాం. కానీ నిజజీవితంలో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కొద్ది గంటల్లో పెళ్లి ఉందనగా పెళ్లి కూతురు జంప్‌ అవడంతో ఆ వధువు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నాటకలోని గుండ్లుపేటెలోని హొరదహళ్లీ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే పుట్టేగౌడ(Putte Gowda) తన కూతురు సుచిత్రకు(Suchitra) ఈనెల 19న గుండ్లుపేటలోని(Gundlupeta) రామాలయంలో పెళ్లి నిశ్చయించారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వానించారు. పెళ్లి కోసం ఒక్కొక్కరుగా బంధువులు వస్తున్నారు. ఇంతలోనే ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని పెళ్లి కూతురు ప్రియుడితో(Lover) లేచిపోయింది. తన కూతురు తనకు అన్యాయం చేసిందని, అవమానం తట్టుకోలేక పుట్టేగౌడ మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో ఈనెల 18న తన పొలానికి వెళ్లిన పుట్టేగౌడ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలానికి వెళ్లిన పుట్టేగౌడ ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో పెళ్లి ఇల్లు కన్నీటి సంద్రంగా మారింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డబ్బులు మోగడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated On 20 Nov 2023 1:29 AM GMT
Ehatv

Ehatv

Next Story