సస్పెండ్ అయిన జెడి(ఎస్) ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు
సస్పెండ్ అయిన జెడి(ఎస్) ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించి అశ్లీల వీడియోల లీక్, సర్క్యులేషన్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను సిట్ అరెస్టు చేసింది. చేతన్, లికిత్ గౌడ అనే ఇద్దరు బీజేపీ కార్యకర్తలను విచారణ కోసం పిలిపించి.. ఆ తర్వాత అరెస్టు చేశారు.
ఏప్రిల్ 26న రాష్ట్రంలో మొదటి దశ లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్‌లను అందరికీ పంచారు. హాసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినట్లుగా ఆరోపించిన వీడియోలు ఆయన నియోజకవర్గం అంతటా పంపిణీ చేశారు. హసన్ జిల్లాలో తొలి దశలో పోలింగ్ జరిగింది. ఈ గ్రాఫిక్ వీడియోలు, చివరికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోకి ప్రవేశించాయి. ఈ ఉదంతం కర్ణాటక రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించింది. కాంగ్రెస్ ప్రభుత్వం దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేయగా, బీజేపీ, జెడి(ఎస్) సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశాయి.