శంషాబాద్‌లో(shamshabad) దారుణహ‌త్య‌కు గురైన‌ అప్సర కేసులో నిందితుడు పూజారి వెంకట సాయి కృష్ణను(Sai Krishna) పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అంటే 22 వరకు ఆయ‌న రిమాండ్‌లో ఉంటాడు.

శంషాబాద్‌లో(shamshabad) దారుణహ‌త్య‌కు గురైన‌ అప్సర కేసులో నిందితుడు పూజారి వెంకట సాయి కృష్ణను(Sai Krishna) పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అంటే 22 వరకు ఆయ‌న రిమాండ్‌లో ఉంటాడు. సాయికృష్ణపై ఐపీసీ(IPC) సెక్షన్లు 302, 201 కింద పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఆమె గర్భవతి అని నిందితుడు వెల్లడించడంతో.. శవపరీక్ష నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. అదే నిజమైతే మరిన్ని సెక్షన్లు విధించే అవ‌కాశం ఉంది.

నిందితుడు సాయి కృష్ణ.. అప్సరను శంషాబాద్‌లో హత్య చేసి.. కారులో డెడ్ బాడీనీ సరూర్ నగర్(saroornagar) డంప్ చేసి.. అక్క‌డ ఓ మ్యాన్ హోల్‌లో(Manhole) పడేశాడు. గుట్టు బయటపడకుండా ఉండేందుకు మ్యాన్ హోల్ కు కాంక్రీట్ వేశాడు. నిందితుడు సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అప్సర డెడ్ బాడీని వెలికి తీశారు. అప్సర హత్యకు సాయికృష్ణ ఎప్ప‌టినుంచో ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే అప్సరకు ట్యాబ్లెట్స్‌ ఇచ్చి మత్తులోకి దించి, ఆ తర్వాత బండరాయితో మోది చంపినట్లు విచారణలో బయటపడింది. హత్య నుంచి బయటపడేందుకు ఈనెల 5న శంషాబాద్‌ పీఎస్‌కి వెళ్లి మేనకోడలు మిస్సింగ్‌ అంటూ తప్పుడు కంప్లైంట్‌ చేశాడు. పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు సాయికృష్ణ. ఎట్ట‌కేల‌కు సాయికృష్ణ చేసిన‌ నేరం బ‌ట్ట‌బ‌య‌లైంది.

Updated On 9 Jun 2023 11:49 PM GMT
Ehatv

Ehatv

Next Story