శిరీష(Sirisha) అనే 19 ఏళ్ల నర్సింగ్‌ విద్యార్థిని(Nursing Student) మృతి కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో ఆమె బావ(Cousin), అతడి స్నేహితుడు కలిసి శిరీషను హత్య చేసినట్టు పోలీసుల నిర్ధారణలో తేలింది. శిరీష మృతిపై మొదట్నుంచి పలు అనుమానాలు కలిగాయి. ఆమెది ఆత్మహత్య అన్నారు. కాదు, తండ్రే చంపి ఉంటాడని గ్రామస్థులు కొందరు చెప్పారు.

శిరీష(Sirisha) అనే 19 ఏళ్ల నర్సింగ్‌ విద్యార్థిని(Nursing Student) మృతి కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో ఆమె బావ(Cousin), అతడి స్నేహితుడు కలిసి శిరీషను హత్య చేసినట్టు పోలీసుల నిర్ధారణలో తేలింది. శిరీష మృతిపై మొదట్నుంచి పలు అనుమానాలు కలిగాయి. ఆమెది ఆత్మహత్య అన్నారు. కాదు, తండ్రే చంపి ఉంటాడని గ్రామస్థులు కొందరు చెప్పారు. పోలీసులు మాత్రం అనిల్‌పై ఓ కన్నేసి ఉంచారు. శిరీష మరణ వార్త తెలిసినప్పట్నుంచి అనిల్‌నే పోలీసులు అనుమానించారు. అనిల్‌ కాల్‌ డేటా అధారంగా అతడి ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరిపారు పోలీసులు.

దాంతో మొత్తం కథ బయటకు వచ్చింది. చెప్పిన మాట వినడం లేదని, అస్తమానం ఫోన్‌ చూస్తూ ఉంటుందని శిరీషతో అనిల్‌(Anil) గొడవపడ్డాడు. ఆ సమయంలో శిరీష మరో గదిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసింది. గది తలుపులు పగలగొట్టి శిరీషను బయటకు తీసుకొచ్చిన అనిల్‌ ఆమెను కొట్టాడు. తర్వాత పరిగి వెళ్లాడు. బావ కొట్టడంతో మనస్తాపానికి గురై శిరీష బయటకు వెళ్లిపోయింది. శిరీష ఇంట్లోంచి వెళ్లిపోయిన సంగతి ఆమె తమ్ముడు బావ అనిల్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. అప్పటికే తన ఫ్రెండ్‌తో కలిసి ఫుల్లుగా మందు తాగి ఉన్నాడు.

మద్యం మత్తులోనే మరో బీర్‌ బాటిల్‌ను కొన్నాడు అనిల్‌. తన స్నేహితుడిని వెంటేసుకుని కాడ్లాపూర్‌కు(Kadlapur) బయలుదేరాడు. ఊరు శివారులో ఉన్న మైసమ్మ గుడి దగ్గర అతడికి శిరీష కనిపించింది. అప్పటికే కోపంతో ఉన్న అనిల్‌ మళ్లీ శిరీషను కొట్టాడు. అక్కడే ఉన్న కుంటవైపుకు తీసుకెళ్లి బీర్ బాటిల్‌ను పగులగొట్టి అనిల్‌, అతడి ఫ్రెండ్‌ కలిసి శిరీష కంట్లో గుచ్చారు.

తనను వదిలేయమని ఆమె ఎంతగా ప్రాధేయపడినా ఆ కఠినాత్ములు కరగలేదు. మోకాలు లోతు నీళ్లున్న కుంటలోకి శిరీషను విసిరేశారు. ఆమెపై అనిల్‌, అతడి ఫ్రెండ్‌ కలిసి నిల్చున్నారు. కాసేపటికే ఊపిరాడక శిరీష చనిపోయింది. ఆమె మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ ఉన్న గుర్తులను మాయం చేశారు. ఏమీ తెలియనట్టు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. కనిపించకుండాపోయిన శిరీష కోసం వెతుకుతున్నట్టు తెగ నటించారు. పోలీసుల ఎదుట శిరీష ఆత్మహత్య చేసుకున్నదని చెప్పే ప్రయత్న చేశారు.

Updated On 14 Jun 2023 2:35 AM GMT
Ehatv

Ehatv

Next Story