కల్తీ పాల దందాను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఈ దందాకు సంబంధించి పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేయ‌గా.. అసలు సూత్ర‌ధారి శేఖర్ పరారీలో ఉన్నారు. కర్నూల్ నుంచి శంషాబాద్ మీదుగా నాగపూర్ వెళ్తున్న పాల ట్యాంకర్ నుండి పాలను తీసిన నలుగురు నిందితులు నీళ్లను పోశారు.

కల్తీ పాల(Adulterated Milk) దందాను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు(Shamshabad Police) గుట్టు రట్టు చేశారు. ఈ దందాకు సంబంధించి పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు(Arrest) చేయ‌గా.. అసలు సూత్ర‌ధారి శేఖర్(Shekar) పరారీలో ఉన్నారు. కర్నూల్(Kurnool) నుంచి శంషాబాద్(Shamshabad) మీదుగా నాగపూర్(Nagpur) వెళ్తున్న పాల ట్యాంకర్(Milk Tanker) నుండి పాలను తీసిన నలుగురు నిందితులు నీళ్లను పోశారు. తొమ్మిది వేల లీటర్ల పాల లోడుతో వెళ్తున్న ట్యాంకర్ నుంచి కేటుగాళ్లు మూడు వేల లీటర్ల పాలను బయటకు తీశారు. 40 లీటర్ల సామ‌ర్థ్యం కలిగిన 83 పాల టిన్నులను తీసుకొచ్చిన ముఠా.. వాటిలో పాలను దొంగలించింది. మేడ్చల్(Medchal) కు చెందిన శేఖర్ అనే వ్యక్తి కల్తీ దందాకు తెరలేపారు. శేఖర్ మేడ్చల్‌లో స్వీట్ షాప్(Sweetshop) బిజినెస్ చేస్తుంటాడు. శేఖర్ వ‌ద్ద ప‌నిచేసే ముగ్గురు వ్య‌క్తులు చండీలాల్(Chandilal), చేతన్(Chetan), సచిన్(Sachin) తో సహా వారికి సహకరించిన పాల ట్యాంకర్ డ్రైవర్ వెంకన్న(Venkanna)ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు బ‌య‌ట‌కు తీసిన‌ 3000 లీటర్ల పాలతో పాటు ట్యాంకర్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు.

Updated On 23 July 2023 8:53 PM GMT
Yagnik

Yagnik

Next Story