దుర్వ్యసనాలకు బానిసయ్యాడో పాత నిందితుడు. ఫుల్లుగా తాగేసి(Alcoholic) పడిపోయేవాడు. దానికి తోడు గంజాయి(weed) సేవించేవాడు. మరి వీటికి డబ్బు కావాలిగా! ఆ డబ్బు కోసం రోడ్లపై పడేవాడు. రోడ్ల వెంట నిద్రించేవారి తలపై బండరాయితో మోది చంపేసేవాడు(Murder).

దుర్వ్యసనాలకు బానిసయ్యాడో పాత నిందితుడు. ఫుల్లుగా తాగేసి(Alcoholic) పడిపోయేవాడు. దానికి తోడు గంజాయి(weed) సేవించేవాడు. మరి వీటికి డబ్బు కావాలిగా! ఆ డబ్బు కోసం రోడ్లపై పడేవాడు. రోడ్ల వెంట నిద్రించేవారి తలపై బండరాయితో మోది చంపేసేవాడు(Murder). వారి దగ్గర ఉన్న డబ్బుతో ఉడాయించేవాడు. ఇలా రెండు వారాల వ్యవధిలోనే ముగ్గురిని చంపేశాడు. ఆ సీరియల్‌ కిల్లర్‌ను హైరాబాద్‌ శివారు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు(Mylardevpally Police) అరెస్ట్‌ చేశారు.

లేకపోతే ఇంకెంత మంది అతడి చేతిలో బలయ్యేవారో! ఇతడిపై ఎనిమిది హత్యలు(8 Murders), ఒక అత్యాచారం(1 Rape), అయిదు దోపిడీ(5 theft cases) కేసులున్నట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే రాజేంద్రనగర్‌ మాణిక్యమ్మ కాలనీకి చెందిన 34 ఏళ్ల బ్యాగరి ప్రవీణ్‌ చిన్నప్పుడే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. రాజేంద్రనగర్‌కే చెందిన షేక్‌ ఫయాజ్‌, దర్గా నరేశ్‌, ప్రవీణ్‌ ఓ ముఠాగా ఏర్పడ్డారు. 2011లో ఓ ఇంట్లో దోపిడీకి పథకం వేశాడు ప్రవీణ్‌. అర్థరాత్రి ముగ్గరు కలిసి ఆ ఇంటికి వెళ్లారు. పాపం ఆ సమయంలో కుటుంబ యజమాని మూత్ర విసర్జన కోసం బయటకు వచ్చాడు. ఆయనను రాయితో కొట్టి చంపారు.

ఆయన భార్యపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారు. చప్పుడుకు నిద్రలేచిన ఆమె పదేళ్ల కుమారుడిని కూడా చంపేశారు. నగదు, నగలు తీసుకుని పారిపోయారు. ఈ మూడు హత్యలు చేసిన తర్వాత ప్రవీణ్‌(Praveen) చక్కగా స్నానం చేసి స్థానిక గుడిలో పూజలు చేశాడట. అదే ఏడాది నెల వ్యవధిలోనే ప్రవీణ్‌ మరో రెండు హత్యలు చేశాడు. రాజేంద్రనగర్‌లోని పిల్లర్‌ నంబర్‌ 127 దగ్గర రోడ్డు పక్కన నిద్రపోతున్న ఓ యాచకుడిని బండరాయితో మోది చంపేశాడు.

అతడి దగ్గరున్న డబ్బుతో పారిపోయాడు. అలాగే ఫుట్‌పాత్‌పై నివాసముంటున్న పి.ప్రకాశ్‌ను కూడా బండరాయితో తలపై కొట్టి సొమ్ముతో ఉడాయించాడు. ఆ తర్వాత మరికొన్ని దొంగతనాలు, దోపిడీలు చేశాడు. అప్పుడే పోలీసులకు దొరికాడు. ఇతడు చేసిన నేరాలకుగాను కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. లాస్టియర్‌ నవంబర్లో బెయిల్‌పై బయటకొచ్చాడు ప్రవీణ్‌. అప్పట్నుంచి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాజీవ్‌ గృహకల్ప దగ్గర ఉంటున్నాడు. మందు తాగేందుకు, గంజాయి సేవించేందుకు డబ్బులు అవసరమయ్యాయి.

మళ్లీ హత్యలు చేయడం మొదలుపెట్టాడు. ఈనెల 7వ తేదీన మైలార్‌దేవ్‌ పల్లి పరిధిలోని నేతాజీనగర్‌ రైల్వే ట్రాక్‌ పక్కన నిద్రపోతున్న ఓ యాచకుడిని బండరాయితో కొట్టి చంపాడు. ఈ నెల 21వ తేదీన అర్ధరాత్రి మైలార్‌దేవ్‌పల్లి స్వప్న థియేటర్‌ దగ్గర నిద్రపోతున్న వ్యక్తిని కూడా అలాగే చంపేశాడు. 500 రూపాయలు అవసరమైనప్పుడల్లా హత్యలు చేశాడీ దుర్మార్గుడు. రోడ్డు పక్కన నిద్రించే వారిని టార్గెట్‌ చేసేవాడు ప్రవీణ్‌. వారి పక్కనే కాసేపు నిద్రపోతున్నట్టు నటించేవాడు. తర్వాత చంపేసి వారి దగ్గరున్న డబ్బుతో పరారయ్యేవాడు. ఎందుకు ఈ హత్యలు చేశావని పోలీసులు అడిగినప్పుడు 'చంపేశాను... అయిపోయింది.. ఏం చేద్దాం' అని బదులిచ్చాడట ప్రవీణ్‌.

Updated On 23 Jun 2023 5:17 AM GMT
Ehatv

Ehatv

Next Story