పబ్లిసిటీ (Publicity) పిచ్చి కోసం ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఈరోజుల్లో అర్థం కావడంలేదు. ఇన్‌ఫ్లూయెన్సర్‌ (Influencer) అని చెప్పుకుంటూ సమాజానికి ఎలాంటి మెసేజ్‌ ఇస్తున్నామన్న సోయే లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా ముంబై సీఎస్‌ఎంటీ రైల్వే స్టేషన్‌లో ఓ లేడీ హల్‌చల్‌ చేసింది. పోలీసుల వివరాల ప్రకారం ముంబైలో సీమా కనోజియా (Seema Kanojia) అనే ఇన్‌ఫ్లూయెన్సర్‌ CSMT ఫాట్‌ఫారంలో డ్యాన్స్‌ వేసింది

పబ్లిసిటీ (Publicity) పిచ్చి కోసం ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఈరోజుల్లో అర్థం కావడంలేదు. ఇన్‌ఫ్లూయెన్సర్‌ (Influencer) అని చెప్పుకుంటూ సమాజానికి ఎలాంటి మెసేజ్‌ ఇస్తున్నామన్న సోయే లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా ముంబై సీఎస్‌ఎంటీ రైల్వే స్టేషన్‌లో ఓ లేడీ హల్‌చల్‌ చేసింది. పోలీసుల వివరాల ప్రకారం ముంబైలో సీమా కనోజియా (Seema Kanojia) అనే ఇన్‌ఫ్లూయెన్సర్‌ CSMT ఫాట్‌ఫారంలో డ్యాన్స్‌ వేసింది. ఆమె రైలు నుంచి దూకి CSMTG స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫారంపై తోటి ప్రయాణికుల ముందే పడుతూ, లేస్తూ, దొర్లుతూ డ్యాన్స్‌లు వేసింది. ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తూ ఆమె చేసిన డ్యాన్సులతో తోటివారికి కంపరం పుట్టించింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిబంధనలకు విరుద్దంగా ఆమె ప్రవర్తించడం, రైల్వే ఫ్లాట్‌ఫాం డ్యాన్స్‌ చేయడం చట్టరీత్యా నేరం కావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని.. సీమా కనోజియాతో క్షమాపణలు (Apologies) చెప్పించారు. తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే క్షమించండి అంటూ ఆమె వేడుకున్నారు. అయితే సీమా కనోజియా తను చేసిన పనిపట్ల విచారం వ్యక్తం చేయడం లేదని.. తాను చేసిన వికృత చేష్టలకు ఎంత మాత్రం ఆమెకు బాధలేదని నెటిజన్లు (Netizens) విమర్శిస్తున్నారు

Updated On 16 Dec 2023 12:56 AM GMT
Ehatv

Ehatv

Next Story