5 ఏళ్ల వయసులో ఆ మహిళకు ప్రియుడితో లేచిపోవాలనే ఆలోచన వచ్చింది.

45 ఏళ్ల వయసులో ఆ మహిళకు ప్రియుడితో లేచిపోవాలనే ఆలోచన వచ్చింది. దీంతో తనకు అడ్డుగా ఉన్న పిల్లలను చంపాలనుకుంది ఆ కసాయితల్లి. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌లో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి చంపిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వివాహేతర సంబంధం కారణంగా పిల్లలను, భర్తను చంపేయాలని రజిత(Rajitha)(45) ప్లాన్ చేసింది. ఇటీవల పదో తరగతి విద్యార్థుల గెట్ టూ గెదర్ పార్టీలో స్నేహితుడు కలిశాడు. అప్పటి నుంచి చాటింగ్‌లు, డేటింగ్‌లు కొనసాగుతున్నాయి. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ఘాతుకానికి పాల్పడింది తల్లి రజిత. ఈ నెల 27న రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో విషపదార్థం కలిపింది. అయితే పెరుగు తినకుండా.. వాటర్ ట్యాంక్ తీసుకొని కాలనీలో వాటర్ సప్లైకి భర్త చెన్నయ్య వెళ్లిపోయారు. తర్వాత పిల్లలకు పెరుగన్నం పెట్టిన నిందితురాలు. అర్ధరాత్రి రెండు గంటలకు చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి విగతజీవులుగా ముగ్గురు పిల్లలు సాయికృష్ణ(Sai krishna)(12), మధు ప్రియ(Madhu priya)(10), గౌతమ్ (Gowtham)(8) పడి ఉన్నారు. తనకు కూడాకడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో భర్త చెన్నయ్య రజితను ఆస్పత్రిలో చేర్పించాడు. మొదట భర్త చెన్నయ్యపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అసలు విషయం బయటపడింది. రజిత వివాహేతర సంబంధం గురించి పోలీసులు నిజాలు రాబట్టారు. రజిత టెన్త్ క్లాస్ ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాఫీగా సాగుతున్న సంసారంలో రజిత చేసిన నిర్వాకంతో పిల్లల హత్యగావించబడ్డారు. తాత్కాలిక సంబంధాలతో చక్కటి సంసారాన్ని పాడుచేసిన రజితను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated On 3 April 2025 7:38 AM GMT
ehatv

ehatv

Next Story