ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి సాకుతో అత్యాచారం చేసిన యువకుడు.. కత్తితో బాధితురాలి శరీరంపై తన పేరు రాశాడు. అంతేకాదు.. తన స్నేహితులతో కూడా గడపాలంటూ ఒత్తిడి తెచ్చేవాడని.. ఒప్పుకోకపోవడంతో క్రూరంగా హింసించేవాడని బాధితురాలు ఆరోపించింది.

Molestation Accused Write Name on girl body with knife in Gorakhpur
ఉత్తరప్రదేశ్(Utterpradesh)లోని గోరఖ్‌పూర్(Gorakhpur) జిల్లాలో ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి సాకుతో అత్యాచారం చేసిన యువకుడు.. కత్తితో బాధితురాలి శరీరంపై తన పేరు రాశాడు. అంతేకాదు.. తన స్నేహితులతో కూడా గడపాలంటూ ఒత్తిడి తెచ్చేవాడని.. ఒప్పుకోకపోవడంతో క్రూరంగా హింసించేవాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూన్ 27న జంఘా పోలీస్ స్టేషన్ లో నిందితుడు, అతని తల్లి, ఇద్దరు సోదరీమణులపై కేసు నమోదైంది. శనివారం నిందితుడైన యువకుడిని పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు.
జంగిల్ రసూల్‌పూర్ నంబర్ టూలోని నెక్వార్ తోలా నివాసి జితేంద్ర యాదవ్(Jithendra Yadav)తో తనకు పరిచయం ఉందని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. పెళ్లి సాకుతో నాలుగేళ్లుగా అద్దెకు గది తీసుకుని.. తనతో ఉంటూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చినందుకు కొట్టేవాడు. అత్యాచారానికి సంబంధించిన వీడియోను ఇంటర్నెట్ మీడియాలో ప్రసారం చేస్తానని బెదిరించాడు. జితేంద్ర యాదవ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని.. అక్కడి నుంచి జైలుకు పంపామని ఎస్పీ మనోజ్ అవస్తీ(Manoj Awasthi) తెలిపారు.
