మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్‌ను ఆమె భర్త ఇంట్లోనే దారుణంగా హత్య చేశాడు. క్రిస్టినా జోక్సిమోవిక్‌ భర్త పేరు థామస్. ఆమెను గొంతుకోసి హత్య చేశాడు.

మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్‌ను ఆమె భర్త ఇంట్లోనే దారుణంగా హత్య చేశాడు. క్రిస్టినా జోక్సిమోవిక్‌ భర్త పేరు థామస్. ఆమెను గొంతుకోసి హత్య చేశాడు. అంతేకాదు తాను చేసిన నేరాన్ని దాచిపెట్టేందుకు భార్య మృతదేహాన్ని ముక్కలుగా కోసి.. ఆ తర్వాత ఆమె శరీర భాగాలను మిక్సీలో వేసి యాసిడ్‌లో కరిగించి నేరాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోలేకపోయాడు. చివరకు పోలీసులు అతడిని పట్టుకోగా.. నేరాన్ని అంగీకరించాడు. అయితే విచారణలో అతడు చెప్పిన విషయాలతో పోలీసులు ఆశ్చర్యపోయారు. అయితే.. ఆత్మరక్షణ కోసమే తన భార్యను హత్య చేశానని.. ఆమె చనిపోవడంతో భయాందోళనకు గురయ్యానని.. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికిన‌ట్లు వెల్ల‌డించాడు.

ఫిబ్రవరిలో జోక్సిమోవిక్ వికృతమైన శరీర భ‌గాలు బ‌య‌ట‌ప‌డ‌టంతో ఈ భయంకరమైన నేరం వెలుగులోకి వచ్చింది. అధికారులు విచారణ ప్రారంభించి.. ఆమె అవయవాలను ఛేదించే క్ర‌మంలో.. నిందితుడు ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారించారు. ఈ నేరానికి సంబంధించి పోలీసులు థామస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. థామస్ కోర్టు నుండి బెయిల్ డిమాండ్ చేయ‌గా.. దానిని ఫెడరల్ కోర్టు తిరస్కరించింది.

థామస్ తన భార్య మృతదేహాన్ని రంపం, కత్తి, గార్డెన్ షియర్స్ ఉపయోగించి ముక్క‌లు చేసిన‌ట్లు స్విస్ మీడియా సంస్థ టుడే నివేదించింది. తరువా.. అతడు ఆ అవశేషాలను కరిగించడానికి ఒక రసాయన ద్రావణంలో ఉంచాడు. అతడి క్రూరత్వానికి అధికారులు కూడా నివ్వెరపోయారు.

ఆత్మరక్షణ కోసమే తన భార్యను హత్య చేశానని.. క్రిస్టినా తనపై కత్తితో దాడి చేసిందని థామస్ పేర్కొన్నాడు. అయితే మెడికల్ రిపోర్టు మాత్రం.. అతడి మాటలకు విరుద్ధంగా ఉంది. శవపరీక్షలో ఆమె శరీరాన్ని ఛిద్రం చేసినట్లు వెల్లడైంది. దీంతో అత‌డి ఆత్మరక్షణ అభ్యర్థన సందేహాన్ని కలిగిస్తుంది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story