అనంతపురం జిల్లా(Anantapur District) యాడికి మండలంలోని(Yadiki mandal) నిట్టూరు గ్రామం(Nittur village) ట్రిపుల్ మర్డర్(Triple Murder) ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాళ్లోకెళితే.. యాడికి మండలం నిట్టూరు గ్రామంలో మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి నిద్రపోతున్న దంపతులను అకారణంగా కొట్టి చంపాడు.

Triple murder in Anantapur
అనంతపురం జిల్లా(Anantapur District) యాడికి మండలంలోని(Yadiki mandal) నిట్టూరు గ్రామం(Nittur village) ట్రిపుల్ మర్డర్(Triple Murder) ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాళ్లోకెళితే.. యాడికి మండలం నిట్టూరు గ్రామంలో మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి నిద్రపోతున్న దంపతులను అకారణంగా కొట్టి చంపాడు. అది చూసిన స్థానికులు.. ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపారు. బాలరాజు, సోమక్క దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా.. మతిస్థిమితం సరిగా లేని ప్రసాద్ అనే వ్యక్తి వారిని గొడ్డలితో నరికి చంపాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ప్రసాద్‌ను రాళ్లతో కొట్టి చంపారు. రాత్రి రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి జరిగిన ఈ హత్యలు అనంతపురం జిల్లాలో సంచలనం రేకెత్తించాయి. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
