మతం మీద ఉన్న మూఢభక్తి ,మూడవ విశ్వాసం 47 మంది ప్రాణాలను బలితీసుకుంది.ఆఫ్రికాలోని (africa)కెన్యాలో(kenya) ఈ భయంకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.తప్పుదారిలో పాస్టర్(paster) చేసిన మత బోధలతో కొంతమంది తమ ప్రాణాలను తీసుకున్నారు. కెన్యాలోని కిల్ఫీ ప్రావిన్స్‌లోని షాకహోలా అటవీ ప్రాంతంలో పోలీసులు జరిపిన తవ్వకాల్లో ఇప్పటి వరకు 11 మంది మృత దేహాలు వెలికి తీశారు .భగవంతుడు కోసం ఉపవాసం చేసి కొంతమంది తమకు తామే ఆత్మహత్యకు ప్రేరేపించుకున్నారు.. అలా చేస్తే జీసస్ ని కలుసుకోవచ్చు అంటూ పాస్టర్ చెప్పిన మాటలకు ప్రభావితమై ఈ దారుణానికి ఒడికట్టారు.

మూఢభక్తి ,మూఢవిశ్వాసం 47 మంది ప్రాణాలను బలితీసుకుంది .ఆఫ్రికాలోని (africa)కెన్యాలో(kenya) ఈ భయంకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.తప్పుదారిలో పాస్టర్(paster) చేసిన మత బోధలతో కొంతమంది తమ ప్రాణాలను తీసుకున్నారు. కెన్యాలోని కిల్ఫీ ప్రావిన్స్‌లోని షాకహోలా అటవీ ప్రాంతంలో పోలీసులు జరిపిన తవ్వకాల్లో ఇప్పటి వరకు 11 మంది మృత దేహాలు వెలికి తీశారు .భగవంతుడు కోసం ఉపవాసం చేసి కొంతమంది తమకు తామే ఆత్మహత్యకు ప్రేరేపించుకున్నారు.. అలా చేస్తే జీసస్ ని కలుసుకోవచ్చు అంటూ పాస్టర్ చెప్పిన మాటలకు ప్రభావితమై ఈ దారుణానికి ఒడికట్టారు..

గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ చర్చికి(good news international church) చెందిన పాస్టర్‌ మాకెంజీ ఎన్‌థాంగే(Paul Makenzi) చేసిన మతబోధలు కొంతమంది ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు వెల్లడించాయి . రంగంలోకి దిగిన పోలీసులు పాస్టర్ ని అదుపులోకి తీసుకొని విచారించారు . ఆకలితో అలమటించి చనిపోయిన వారిని పాతిపెడితే అప్పుడు వారంతా పరలోకానికి వెళ్తారని నమ్మబలికాడు.పాస్టర్ మాటలు నమ్మిన అమాయకులు ఉపవాసంతో ప్రాణాలు తీసుకుంటున్నారు .మరణించిన వారిని తెల్లని ప్లాస్టిక్‌ షీట్‌లో చుట్టి మట్టిలో పూడ్చిపెట్టాడు . వారం రోజులుగా మృతదేహాల కోసం జరుగుతున్న తవ్వకాల్లో మొత్తం 47 మంది శవాలు దొరికినట్లు సమాచారం . మలిండి సమీపంలోని షాకహోలా వద్ద 800 ఎకరాల (325-హెక్టార్లు) అటవీ ప్రాంతంలో ఈ దారుణ ఘనట చోటుచేసుకుంది.మరో 11 మంది ఉపవాసం ఉండగా, పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స నందించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మరో వైపు ఉపవాసం పేరుతో ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో కొందరు అడవిలో దాక్కున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది . మరోవైపు తాను ఎప్పుడు ప్రజలను ఆత్మహత్యకు ప్రేరేపించలేదని, 2019లోనే చర్చిని మూసివేసినట్లు పాస్టర్‌ విచారణలో చెప్పడం జరిగింది . గతంలో కూడా ఇద్దరు చిన్నారుల మరణానికి కారణమైనట్లు పాస్టర్ పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.అప్పట్లో జరిమానా చెల్లించి, కేసు నుంచి బయపటడ్డాడు.

Updated On 25 April 2023 1:41 AM GMT
rj sanju

rj sanju

Next Story