హైద్రాబాద్‌లో మ‌రో మెడికో ఆత్మహత్య చేసుకున్నాడు. గ‌త మూడు రోజుల క్రితం ఓ వైద్య విద్యార్ధి మ‌ర్మాగం కోసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌గా.. తాజాగా మ‌రో వైద్య విద్యార్ధి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. హైద్రాబాద్ మధురా న‌గర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్‌లో వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్న‌

హైద్రాబాద్‌(Hyderabad)లో మ‌రో మెడికో ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. గ‌త మూడు రోజుల క్రితం ఓ వైద్య విద్యార్ధి మ‌ర్మాగం కోసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌గా.. తాజాగా మ‌రో వైద్య విద్యార్ధి(Medico Student) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. హైద్రాబాద్(Hyderabad) మధురా న‌గర్(Madhura Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్‌(Jawahar Nagar)లో వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్న‌ జగదీష్ (Jagadeesh)(21)అనే యువ‌కుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎర్రగడ్డ(Erragadda)లోని బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేదిక్ కళాశాల(Burgula Ramakrishnarao)లో జగదీష్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు స‌మాచారం. జగదీష్ స్వ‌స్థ‌లం నారాయణపేట జిల్లా(Narayanapet District) మద్దూర్ మండలం. ఆత్మ‌హ‌త్య‌కు ముందు యువ‌తితో గొడ‌వ జ‌రిగిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది. కేసు నమోదు చేసుకున్న మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 12 July 2023 11:21 PM GMT
Yagnik

Yagnik

Next Story