పెళ్లయిన నెల రోజులకే ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది.

పెళ్లయిన నెల రోజులకే ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. చెన్నై అంబత్తూరు సమీపంలోని కొరటూరు ఆగ్రహారం ప్రాంతానికి చెందిన భూపాలన్‌ (27), భాగ్యలక్ష్మి (24) గత పదేళ్లుగా ప్రేమించి నెల క్రితం వివాహం చేసుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడేందుకు దగ్గరలోని స్టేడియానికి వెళ్లాడు. క్రికెట్ మ్యాచ్ ఆడిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన భూపాలన్‌.. లోపలి నుంచి గడియపెట్టి ఉంది. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా భార్య భాగ్యలక్ష్మి తలుపు తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా భూపాలన్ షాక్‌కు గురయ్యాడు. ఇంట్లోని గదిలో ఉరేసుకొని భాగ్యలక్ష్మి కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో భూపాలన్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసిందని.. అది తెలిసిన భార్య ఆవేదనచెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. భూపాలన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ehatv

ehatv

Next Story