చిత్తూరు జిల్లా కాణిపాకం మండలం ఏనుగుండ్లపల్లిలో రెండు కుంటుంబాలు పక్క పక్కన ఇళ్లల్లో నివవాసం ఉంటున్నాయి.

చిత్తూరు జిల్లా కాణిపాకం మండలం ఏనుగుండ్లపల్లిలో రెండు కుంటుంబాలు పక్క పక్కన ఇళ్లల్లో నివవాసం ఉంటున్నాయి. ఆ రెండు కుటుంబాలు కొన్నాళ్లు బాగానే ఉన్నా ఈ కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో గత కొన్ని రోజులుగా వీరి మధ్య మాటలు లేవు. కానీ ఓ భార్య తన భర్త ఫోన్‌లో పక్కింటి మహిళ ఫోన్‌ నెంబర్‌ ఉందని ఆమెతో ఘర్షణకు దిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆ మహిళ ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

పోలీసులు వివరాల ప్రకారం చిత్తూరు మండలం ఏనుగుండ్లపల్లి గ్రామానికి చెందిన రమేష్‌(Ramesh) భార్య ఉమ(Uma) (30). ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. వీరి పక్క ఇంట్లోనే శివమణి(Shivamani), సుజాత(Sujatha)అనే దంపతులు ఉన్నారు. ఈ ఇరుకుటుంబీకులు దగ్గర బంధువులు. వీళ్ల మధ్య చిన్నచిన్న తగదాలు గొడవగా మారాయి. దీంతో కొన్నిరోజులుగా ఈ రెండు కుటుంబీకుల మధ్య మాటలు లేవు. అయితే సోమవారం శివమణి ఫోన్‌లో ఉమ ఫోన్‌ నంబరును సుజాత గమనించింది. ఆమె నంబరు నీ ఫోన్‌లో ఎందుకు ఉందని సుజాత భర్తతో గొడవకు దిగింది. అంతేకాకుండా సుజాత రోడెక్కింది. ఉమతో గొడవకు దిగింది. ఇద్దరు దుర్భాషలాడుకున్నారు.. మాట మాట పెరిగి ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉమ సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఓ అట్టముట్టపై సుజతే తన చావుకు కారణమని రాసి జాకెట్‌లో పెట్టుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనుమానం పెనుభూతం కావడంతో నిండు ప్రాణం పోవాల్సి వచ్చింది. తన పరువుకు భంగం వాటిల్లిందని ఉమ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలిచివేసింది.

ehatv

ehatv

Next Story