మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం బస్సులో మంటలు చెలరేగడంతో 26 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై సమాచారం ఇచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నాగ్‌పూర్ నుండి పూణెకు వెళ్తుండగా తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బుల్దానా జిల్లా సింధ్‌ఖేడ్రాజా సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

మహారాష్ట్ర(Maharashtra)లోని బుల్దానా(Buldana) జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే(Samruddhi Mahamarg Expressway)పై శనివారం బస్సులో మంటలు చెలరేగడంతో 26 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. పోలీసులు(Police) ఈ ఘ‌ట‌న‌పై సమాచారం ఇచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నాగ్‌పూర్(Nagpur) నుండి పూణె(Pune)కు వెళ్తుండగా తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో బుల్దానా జిల్లా సింధ్‌ఖేడ్రాజా సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారు బుల్దానా సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రాథమిక సమాచారం మేరకు బస్సు టైరు పగిలి డివైడర్‌తో పాటు స్తంభాన్ని ఢీకొట్టడంతో మంటలు అంటుకున్నాయని బుల్దానా ఎస్పీ సునీల్ కడసానే(Sunil Kadasne) పీటీఐకి తెలిపారు. బస్సులో ఉన్న 33 మంది ప్రయాణికుల్లో 26 మంది కాలి బూడిదయ్యారని అధికారి తెలిపారు. మిగిలిన ఎనిమిది మంది ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రి(Hospitals)కి తరలించినట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మృతదేహాలను(Dead Bodies) గుర్తించి వారి బంధువులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామ‌ని తెలిపారు.

Updated On 30 Jun 2023 9:49 PM GMT
Yagnik

Yagnik

Next Story