ఇంట్లో గొడవల కారణంగా కుమార్తెను కత్తితో 25 సార్లు పొడిచి చంపాడు ఓ తండ్రి. అడ్డొచ్చిన తన భార్యను కూడా నిందితుడు గాయపరిచాడు. సూరత్‌కు చెందిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మే 18వ తేదీ రాత్రి సూరత్‌లోని కడోదర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Man stabs daughter 25 times over domestic dispute in Surat, attack caught on camera
ఇంట్లో గొడవల(Domestic Dispute) కారణంగా కుమార్తెను కత్తితో 25 సార్లు పొడిచి చంపాడు ఓ తండ్రి. అడ్డొచ్చిన తన భార్యను కూడా నిందితుడు గాయపరిచాడు. సూరత్(Surat)కు చెందిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు(Arrest) చేశారు. మే 18వ తేదీ రాత్రి సూరత్‌లోని కడోదర(Kadodara) ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. హత్య(Murder) జరిగిన రెండు రోజుల తర్వాత అతని భార్య రేఖ(Rekha) ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.
విచారణ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రామానుజ(Ramanuja) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సూరత్‌లోని సత్య నగర్ సొసైటీ(Satya Nagar Society)లో అద్దెకు ఉంటున్నాడు. కుమార్తె టెర్రస్(Terrace)పై పడుకున్న విషయమై భార్యతో జరిగిన చిన్నపాటి వాదనలో నిందితుడు సహనం కోల్పోయాడు. పరిస్థితి హింసకు దారితీసింది.
సీసీటీవీ ఫుటేజీ(CCTV footage)లో దృశ్యాలు రికార్డయ్యాయి. సుమారు రాత్రి 11.20 గంటలకు రామానుజు మొదట తన పిల్లల ముందే భార్యపై కత్తితో దాడి చేశాడు. ఆమె గాయపడగా.. పిల్లలు తండ్రిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ధైర్యంగా అతనిని పట్టుకున్నారు. అయితే.. అతడు వారి నుంచి విడిపించుకుని దాడికి యత్నించాడు. ఆ గందరగోళంలో నిందితుడు తన కుమార్తెను పట్టుకుని అనేకసార్లు కత్తితో పొడిచాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి బాలిక తండ్రి పట్టు నుండి విడిపించుకుని సమీపంలోని గదిలోకి వెళ్లాంది. బాలికను అనుసరించిన నిందితుడు ఆమెను కత్తితో పొడిచి చంపాడు.
తన కుమార్తెపై ఘోరమైన దాడి చేసిన తర్వాత కూడా.. రామానుజ తన భార్యకు హాని చేయాలని నిశ్చయించుకుని డాబాపైకి ఎక్కాడు. అయితే.. తల్లిని రక్షించడానికి పిల్లలు క్రూరుడైన తండ్రితో పోరాడారు. ఈ క్రమంలో వారికి గాయాలయ్యాయి. నిందితుడు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూరత్ పోలీసులు అప్రమత్తమయ్యారు. అధికారులు వేగంగా రామానుజ ను పట్టుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశామని, అతనిపై హత్య, హత్యాయత్నం సహా ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ఆర్‌కె పటేల్(Inspector RK Patel) తెలిపారు.
