దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పార్క్ ప్రాంతంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటనలో యువకుడి పేగులు బయటకు రావడంతో ప్రాణాలు వదిలాడు. ఆదివారం ఢిల్లీలోని రాజ్ పార్క్ ప్రాంతంలో 32 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Man stabbed to death in Delhi
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోని రాజ్‌పార్క్(Raj Park) ప్రాంతంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. ఈ దారుణ ఘటనలో యువకుడి పేగులు బయటకు రావడంతో ప్రాణాలు వదిలాడు. ఆదివారం ఢిల్లీలోని రాజ్ పార్క్ ప్రాంతంలో 32 ఏళ్ల వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అర్ధరాత్రి 12.23 గంటలకు తమకు పీసీఆర్ కాల్ వచ్చిందని అధికారి తెలిపారు. రాజ్ పార్క్ రాఠీ హాస్పిటల్ స్ట్రీట్ సమీపంలో ఒక వ్యక్తి కత్తిపోట్లకు గురైనట్లు కాల్ చేసిన వ్యక్తి నివేదించాడు. దాడి మృతుని పేగు బయట పడేంత క్రూరంగా జరిగింది. బాధితుడు హత్రాస్‌లో నివాసముంటున్న వీరేంద్ర సింగ్‌గా ఆధార్ కార్డు సహాయంతో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అతని భార్య ఆశకు సమాచారం అందించారు. దాడి తర్వాత బాధితుడిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వీరేంద్ర సింగ్(Virendra Singh) మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సంఘటనా స్థలానికి మొబైల్ క్రైమ్ టీమ్(Mobile Crime Team), ఎఫ్‌ఎస్‌ఎల్(FSL) బృందాలను పిలిపించినట్లు పోలీసులు తెలిపారు. హత్యా నేరంపై ఐపీసీ సెక్షన్ 302 కింద ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేశారు. ఘటనా స్థలం నుంచి మృతుడి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. సమీపంలోని సీసీటీవీలను స్కాన్ చేసి సమాచారం సేకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
