ఈ ఆన్ లైన్ బెట్టింగ్ ల గోల రోజు రోజుకి ఎక్కువై పోతుంది . రోజుకొక ఆన్ లైన్ బెట్టింగ్స్ యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి . దీనికి ఎంతో మంది యువకులు బలైపోతున్నారు .ఆఫర్స్ , ఫ్రీ బెట్టింగ్ అంటూ యువతను ఆకర్షిస్తున్నాయి . ఒకసారి వీటి బారిన పడిన యువకులు బయటికి రావడమనేది కష్టమే అని చెప్పాలి .ఈ బెట్టింగ్స్ కి అలవాటు పడ్డ వాళ్ళు అప్పుల పాలు కావడమే కాకుండా..చేసిన అప్పులు తీర్చలేక చివరకు […]
ఈ ఆన్ లైన్ బెట్టింగ్ ల గోల రోజు రోజుకి ఎక్కువై పోతుంది . రోజుకొక ఆన్ లైన్ బెట్టింగ్స్ యాప్‌లు అందుబాటులోకి వస్తున్నాయి . దీనికి ఎంతో మంది యువకులు బలైపోతున్నారు .ఆఫర్స్ , ఫ్రీ బెట్టింగ్ అంటూ యువతను ఆకర్షిస్తున్నాయి . ఒకసారి వీటి బారిన పడిన యువకులు బయటికి రావడమనేది కష్టమే అని చెప్పాలి .ఈ బెట్టింగ్స్ కి అలవాటు పడ్డ వాళ్ళు అప్పుల పాలు కావడమే కాకుండా..చేసిన అప్పులు తీర్చలేక చివరకు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. . ఇలాంటి ఘటనే హైదరాబాద్ పహాడిషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మామిడిపల్లికి చెందిన చంద్రయ్య, శశికళ దంపతుల కుమారుడు రాజశేఖర్ (26). అయితే ఇంటర్ చదివిన రాజశేఖర్.. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
రాజశేఖర్ గత కొంతకాలంగా యాప్‌లలో క్రికెట్, ప్లేయింగ్ కార్డ్స్ అంటూ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు . ఈ బెట్టింగ్‌లలో దాదాపు రూ.4 లక్షల వరకు పొగొట్టుకున్నాడు. అయిన కూడా బెట్టింగ్స్ మానుకోలేదు. చివరకు తల్లి శశికళ బీరువాలో దాచిపెట్టుకున్న బంగారంను కూడా దొంగిలించిన రాజశేఖర్ ...అమ్మేసి బెట్టింగ్‌లు వేశాడు. ఈ బెట్టింగ్‌లలో కూడా రాజశేఖర్ ఓడిపోయాడు.
శివరాత్రి నాడు తల్లి శశికళ బీరువాలో దాచిపెట్టిన బంగారం కోసం.. ఇళ్లు మొత్తం వెతికినా కనిపించకపోవడంతో.. ఇంట్లోని అందరినీ ప్రశ్నించింది. తాము తీయలేదని కుటుంసభ్యులందరూ చెప్పారు. రాజశేఖర్ మీద అనుమానం వచ్చి మరింత గట్టిగా నిలదీసింది. అయితే తాను తీసుకోలేదని బుకాయించి .. రాజశేఖర్ శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. కుటుంసభ్యులు నిలదీయడంతో మనస్తాపం చె౦దిన రాజశేఖర్.. ఆదివారం తెల్లవారుజుమన తాను చనిపోతున్నానంటూ తన సోదరుడికి మెసేజ్ పెట్టాడు. ఇంట్లోని బంగారం తానే తీసుకున్నానని, రూ.40 వేలకు విక్రయించి బెట్టింగ్‌లు వేసి నష్టపోయినట్లు మెస్సేజ్ లో తెలిపాడు. ఆదివారం ఉదయమే పాలు పిదకడానికి షెడ్డు వద్దకు వెళ్ళిన తండ్రికి .. వేపచెట్టుకు రాజశేఖర్ ఉరేసుకుని కనిపించాడు. రాజశేఖర్ రెడ్డి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు రాజశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబసభ్యులపై అప్పగించారు.