ఓ వివాహితను ప్రేమించానని నమ్మబలికాడు ఓ ప్రబుద్ధుడు . పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేస్తున్నాడు . ఇది నిజమే అని నమ్మిన ఆ మహిళా అతడిని నమ్మింది . ఇంతలో అసలు విషయం తెలుసుకున్న ఆ మహిళా స్థానిక పోలీస్ స్టేషన్లో అతని పై కంప్లైంట్ చేసింది . బంజారాహిల్స్ ఎస్.ఐ హరీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ మెహిదీపట్నం సంతోష్ నగర్ కి చెందిన మహమ్మద్ బిన్ ఇషాక్ డిజిటల్ ఎంటర్ ప్రైజెస్ […]

ఓ వివాహితను ప్రేమించానని నమ్మబలికాడు ఓ ప్రబుద్ధుడు . పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేస్తున్నాడు . ఇది నిజమే అని నమ్మిన ఆ మహిళా అతడిని నమ్మింది . ఇంతలో అసలు విషయం తెలుసుకున్న ఆ మహిళా స్థానిక పోలీస్ స్టేషన్లో అతని పై కంప్లైంట్ చేసింది .

బంజారాహిల్స్ ఎస్.ఐ హరీశ్వర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ మెహిదీపట్నం సంతోష్ నగర్ కి చెందిన మహమ్మద్ బిన్ ఇషాక్ డిజిటల్ ఎంటర్ ప్రైజెస్ యూట్యూబర్ గా పని చేస్తున్నాడు . బంజారాహిల్స్ మిథిలానగర్ కు చె౦దిన 32 ఏళ్ళ ఓ వివాహితతో గత అక్టోబర్ లో పరిచయం ఏర్పడింది . తనకు ఇంకా పెళ్లి కాలేదని ప్రేమిస్తున్నానంటూ నమ్మించి, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి ఆమెతో సహా జీవనం చేసాడు. అయితే గతవారం ఆమెకు ..ఇషాక్ గురించి అసలు విషయం తెలిసి షాక్ అయ్యింది . అతడికి ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు అయినట్లు విషయం తెలియగానే ..ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో చివరికి దీని గురించి ఇషాక్ ని నిలదీయడం తో అతను ముఖం చాటేసాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఆ నిత్య పెళ్లి కొడుకు మహమ్మద్ బిన్ ఇషాక్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది . ని౦దితుడి పై కేసు నమోదు చేసిన పోలీస్ లు రిమాండ్ కు పంపించారు .

Updated On 18 Feb 2023 2:43 AM GMT
Ehatv

Ehatv

Next Story