హర్యానాలోని చార్ఖీ దాద్రిలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో యోగా గురువును సజీవంగా పాతిపెట్టాడు ఆ మహిళ భర్త.

హర్యానాలోని చార్ఖీ దాద్రిలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో యోగా గురువును సజీవంగా పాతిపెట్టాడు ఆ మహిళ భర్త. రోహ్‌తక్‌లోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో యోగా గురువుగా పనిచేస్తున్న బాధితుడు జగదీప్(Jagdeep)ను కిడ్నాప్ చేసి ఏడు అడుగుల లోతైన గొయ్యిలో సజీవంగా పాతిపెట్టారు. ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత, మార్చి 24న అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గత ఏడాది డిసెంబర్ 24న పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా జగదీప్‌ను కొందరు కిడ్నాప్ చేశారు. నిందితులు అతని చేతులు, కాళ్ళు కట్టివేసి, నోటికి టేపులు కూడా కట్టాడు. ఆ తర్వాత అతన్ని ఓ పొలానికి తీసుకెళ్లారు, నిందితులు బోరుబావి కోసం అని ఒక కూలీకి చెప్పి లోతైన గొయ్యి తవ్వించాడు. ఆ తర్వాత జగదీప్‌ను ఆ గొయ్యిలో సజీవంగా పాతిపెట్టారు. జగదీప్ కనపడపోయేసరికి పోలీసులు మూడు నెలల పాటు దర్యాప్తు ప్రారంభించారు. జగదీప్ కాల్‌డేటాను పరిశీలించారు. అందులో కొన్ని ఆధారాలతో ధరంపాల్, హర్దీప్ అనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. జగదీప్ ఉంటున్న ఇంటిలో నివసిస్తున్న మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. అందుకే ఆమె భర్త పథకం ప్రకారం అతడిని హత్య చేశారని దర్యాప్తులో తేలింది. నిందితులను రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
