డంపర్ అదుపు తప్పి హైవే ప‌క్క‌న‌ ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న దంపతులు, ఇద్దరు పిల్లలు నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్య హైవేలోని బీబీడీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మౌరంగ్ లాడెన్ డంపర్ అదుపు తప్పి హైవే ప‌క్క‌న‌ ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న దంపతులు, ఇద్దరు పిల్లలు నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన మ‌హిళ‌ ఎనిమిది నెలల గర్భిణి. చ‌నిపోయిన దంప‌తుల‌ ఏడేళ్ల కూతురు ప్రాణాలతో బయటపడింది.

జైత్‌పూర్ బారాబంకిలో నివాసముంటున్న ఉమేష్ (35) టైల్స్ ఆర్టిజన్. త‌న‌ తన భార్య నీలం (32), కుమారులు గోలు (4), సన్నీ (13), కుమార్తె వైష్ణవితో కలిసి ఒక గుడిసెలో నివసిస్తున్నారు. నిన్న రాత్రి కుటుంబం మొత్తం గుడిసెలో నిద్రిస్తున్నారు. రాత్రి 1 గంట ప్రాంతంలో ఓ డంపర్ అదుపు తప్పి గుడిసెలోకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఉమేష్, నీలం, గోలు, సన్నీ మృతి చెందారు. వైష్ణవి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన‌ డంపర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నీలమ్ ఎనిమిది నెలల గర్భిణి. ఆమె మేనల్లుడుపోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేశారు.

Eha Tv

Eha Tv

Next Story