హైద్రాబాద్ బాలనగర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. బాలనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గల ఏ టు ఏ లైఫ్ స్పేసెస్ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్లాట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగుతూ త్వరితగతిన వ్యాపిస్తూ ఉండడంతో అపార్ట్ మెంట్ లో ఉంటున్న జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు.

Major fire breaks out in Balanagar apartment
హైద్రాబాద్(Hyderabad) బాలానగర్(Balanagar) లో అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గల ఏ టు ఏ లైఫ్ స్పేసెస్(A2A Life Spaces) అపార్ట్ మెంట్(Apartment) లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ప్లాట్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగుతూ త్వరితగతిన వ్యాపిస్తూ ఉండడంతో అపార్ట్ మెంట్ లో ఉంటున్న జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతం మొత్తం వ్యాపించాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది(Fire Department) సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ మంటలు ఏ ప్లాట్ లో నుండి వచ్చాయి. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు(Police) ప్రయత్నిస్తున్నారు.
