ముంబైలో(Mumbai) ఓ అధికారి కుమారుడు ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తాను పిలిచిన ఈవెంట్(Event) దగ్గరికి రాలేదని ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మహారాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ ఎండీ అనిల్ గైక్వాడ్(Anil gaikwad) కుమారుడు అశ్వజిత్ (Aswajith)ఈ దారుణానికి ఒడిగట్టాడు. ప్రియ(Priya) అనే యువతిని అశ్వజిత్ ప్రేమిస్తున్నాడు.
ముంబైలో(Mumbai) ఓ అధికారి కుమారుడు ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తాను పిలిచిన ఈవెంట్(Event) దగ్గరికి రాలేదని ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మహారాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ ఎండీ అనిల్ గైక్వాడ్(Anil gaikwad) కుమారుడు అశ్వజిత్ (Aswajith)ఈ దారుణానికి ఒడిగట్టాడు. ప్రియ(Priya) అనే యువతిని అశ్వజిత్ ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో అశ్వజిత్ ఆమెను ఓ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆదేశాలిచ్చాడు. అందుకు ప్రియ అంగీకరించలేదు. దీంతో ఆగ్రహం చెందిన అశ్వజిత్ ఆమెను స్నేహితులతో కలిసి చితకబాదాడు. ప్రియకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి(Hospital) తరలించారు. తన దాడికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో(Social media) షేర్ చేసింది. దీంతో అశ్విజిత్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అమానుషంగా ప్రవర్తించిన అతడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.