ప్రేమకోసం కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. వికృతమైన ఆలోచనలు చేస్తున్నారు. ఊహించని అకృత్యాలకు పాల్పడుతున్నారు. హర్యానా(Haryana)లోని పానీపట్‌(Panipat)లో ఓ అమ్మాయి ఇలాగే చేసింది. ప్రియుడితో కలిసి పారిపోయేందుకు దుష్ట పన్నాగం పన్నింది. తనలాగే ఉన్న మరో యువతిని చంపింది. ఈ ఘటన 2017లో జరిగింది. ఇంతకాలానికి నిజం వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు ఇప్పుడు కటకటాల వెనుక విలపిస్తోంది.

ప్రేమకోసం కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. వికృతమైన ఆలోచనలు చేస్తున్నారు. ఊహించని అకృత్యాలకు పాల్పడుతున్నారు. హర్యానా(Haryana)లోని పానీపట్‌(Panipat)లో ఓ అమ్మాయి ఇలాగే చేసింది. ప్రియుడితో కలిసి పారిపోయేందుకు దుష్ట పన్నాగం పన్నింది. తనలాగే ఉన్న మరో యువతిని చంపింది. ఈ ఘటన 2017లో జరిగింది. ఇంతకాలానికి నిజం వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు ఇప్పుడు కటకటాల వెనుక విలపిస్తోంది. సుమారు ఆరేళ్ల కిందట ఏం జరిగిందంటే... జ్యోతి, కృష్ణ అనే యువతీయువకులు కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకున్నారు. కానీ వీరి పెళ్లికి జ్యోతి ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. దీంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలనే ప్లాన్‌ వేశారు ఇద్దరు. కుటుంబసభ్యులకు అనుమానం కలగకుండా ఉండేందుకు తన రూపురేఖలతో ఉన్న మరో యువతిని చంపేయాలని జ్యోతి నిర్ణయించుకుంది. తన ప్లాన్‌ను ప్రియుడికి చెప్పింది. ప్రియుడు కూడా ఓకే అన్నాడు. ఓ టీవీ సీరియల్‌ ఆధారంగా ఈ పథకాన్ని వేశారు. 2017 సెప్టెంబర్‌ 5న జ్యోతి తన ఫ్రెండ్‌ సిమ్రన్‌ను జీటీ రోడ్డుకు పిలిపించింది. జ్యోతి మనసులోని దురాలోచనను పసిగట్టలేని సిమ్రన్‌ ఆమె పిలిచిన చోటుకు వెళ్లింది. సిమ్రన్‌కు మత్తు కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగించింది జ్యోతి. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత గొంతుకోసి చంపేసింది. సిమ్రన్‌ చనిపోయిన తర్వాత ఆమె దుస్తులు మార్చేసింది. ఘటనాస్థలంలో తనకు సంబంధించిన కొన్ని గుర్తింపు కార్డులు పడేసి ప్రియుడు కృష్ణతో పారిపోయింది జ్యోతి.

పోలీసులు సిమ్రన్‌ డెడ్‌బాడీ జ్యోతిదే అనుకున్నారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. జ్యోతి తల్లిదండ్రులు సిమ్రన్‌ మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఇదిలాఉంటే తమ కూతురు కనిపించకుండా పోయిందంటూ సిమ్రన్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. జ్యోతి మృతదేహంగా భావిస్తున్న యువతి డెడ్‌బాడీ ఫోటోలను సిమ్రన్‌ తల్లిదండ్రులకు చూపించారు. మెడకు ఉన్న దారం, ముక్కుపుడక ఆధారంగా అది తమ కూతురేనని సిమ్రన్‌ తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో జ్యోతి, కృష్ణల కోసం వెతకడం మొదలు పెట్టారు. వీరిద్దరు సిమ్లాలో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు 2020లో వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు కోర్టు విచారణలో ఉన్నప్పుడే కృష్ణ టీబీతో చనిపోయాడు. మొన్న మంగళవారం పానిపట్‌ కోర్టు(Panipat Court)ఈ ఘటనపై తీర్పు ఇచ్చింది. జ్యోతికి జీవిత ఖైదు

Updated On 31 March 2023 4:36 AM GMT
Ehatv

Ehatv

Next Story