దేశంలో పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. పరువు కంటే దురంహకారమే ఎక్కువ, కుల అహంకారమే ఎక్కువ.. ప్రేమించిన జంటను మట్టుపెట్టడానికి అసలు వారికి చేతులు ఎలా వస్తున్నాయో అర్థం కాదు. మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) ఇలాంటి దారుణమే జరిగింది. మధ్యప్రదేశ్ మోరెన(Morena) జిల్లాలో ప్రేమించుకున్న జంటను నిర్ధాక్షిణ్యంగా తుపాకులతో కాల్చి చంపారు పెద్దలు. అక్కడితో ఆగలేదు, వారి మృతదేహాలను మొసళ్లు తిరిగే నదిలో మేతగా వేశారు.
దేశంలో పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. పరువు కంటే దురంహకారమే ఎక్కువ, కుల అహంకారమే ఎక్కువ.. ప్రేమించిన జంటను మట్టుపెట్టడానికి అసలు వారికి చేతులు ఎలా వస్తున్నాయో అర్థం కాదు. మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) ఇలాంటి దారుణమే జరిగింది. మధ్యప్రదేశ్ మోరెన(Morena) జిల్లాలో ప్రేమించుకున్న జంటను నిర్ధాక్షిణ్యంగా తుపాకులతో కాల్చి చంపారు పెద్దలు. అక్కడితో ఆగలేదు, వారి మృతదేహాలను మొసళ్లు తిరిగే నదిలో మేతగా వేశారు. రతన్‌బసాయ్(Ratan Basai) గ్రామానికి చెందిన శివాని తోమర్(Shivani Tomar), పక్క ఊరు బాలూపూర్‌లో(Baloopur) ఉంటున్న రాధేశ్యామ్ తోమర్(Radheshyam Tomar) ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అమ్మాయి తరపు వాళ్లకు ఈ ప్రేమలు పెళ్లిళ్లు నచ్చలేదు. అందుకే జూన్ 3వ తేదీన ఓ పథకం ప్రకారం వారిద్దరిని కాల్చి చంపారు. వారి మృతదేహాలకు బండరాళ్లు కట్టి మొసళ్లు తిరిగే చంబల్ నదీ(Chambal River) ప్రాంతంలో పడేశారు.
చంబల్ ఘరియాల్ అభయారణ్యంలో రెండువేల కంటే ఎక్కువ మొసళ్లు ఉంటాయి. కన్నకొడుకు, అతడు ప్రేమించిన అమ్మాయి కనిపించకపోవడంతో యువకుడి తండ్రి తల్లడిల్లాడు. అమ్మాయి తరపు వాళ్లు ఏమైనా చేసి ఉంటారేమోనన్న అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఆ జంట ఎక్కడికైనా పారిపోయి ఉంటుందని పోలీసులు తొలుత భావించారు. అయితే వారు వెళ్లిపోవడం ఎవరూ చూడకపోవడంతో యువతి తల్లిదండ్రులను, బంధువులను స్టేషన్‌కు పిలిపించారు. తమదైన శైలిలో విచారణ జరిపారు. దాంతో నిజం ఒప్పుకున్నారు. తామే వారిని చంపినట్టు అంగీకరించారు. ఆ ప్రేమ జంట మృతదేహాలను సిబ్బంది సాయంతో బయటకు తీశారు పోలీసులు. అప్పటికే మృతదేహాలు ఛిద్రమయ్యాయి.