హైదరాబాద్‌లో అర్థరాత్రి దారుణం జరిగింది. తప్పచెబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని దైబాగ్‌లో మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు ట్రాన్సజెండర్లు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఇద్దర ట్రాన్స్ జెండర్లను బండరాళ్లు కొట్టి, కత్తులతో అతి కిరాతకంగా పొడిచి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Late night double murder in Hyderabad
హైదరాబాద్(Hyderabad)లో అర్థరాత్రి(Midnight) దారుణం జరిగింది. తప్పచెబుత్ర పోలీస్ స్టేషన్(Tappachebutra police Station) పరిధిలోని దైబాగ్‌లో మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు ట్రాన్సజెండర్లు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఇద్దర ట్రాన్స్ జెండర్ల(Transgender)ను బండరాళ్లు కొట్టి, కత్తులతో అతి కిరాతకంగా పొడిచి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చనిపోయిన ట్రాన్స్ జెండర్లను యూసుఫ్ అలియాస్ డాలి(Yusuf alias Dali)(25), రియాజ్ అలియాస్ సోఫియా(Riaz alias Sophia)(30) గా గుర్తించారు. తప్పచెబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఇద్దరు హిజ్రాలను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి కత్తులతో పొడిచి, బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లు డీసీపీ కిరణ్ ఖరే(DCP Kiran Khare)వెల్లడించారు. ఘటనాస్థలంలో కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
