మీరట్ జిల్లాలోని రోహతా పోలీస్ స్టేషన్ పరిధిలో 32 ఏళ్ల వ్య‌క్తి రెచ్చిపోయాడు. ఉదయం మలవిసర్జన కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన పదేళ్ల బాలికను అపహరించి చెరుకు తోటలోకి తీసుకెళ్లాడు. బాలిక కేక‌లు వేయడంతో..

మీరట్(Meerut)జిల్లాలోని రోహతా పోలీస్ స్టేషన్ పరిధిలో 32 ఏళ్ల వ్య‌క్తి రెచ్చిపోయాడు. ఉదయం మలవిసర్జన కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన పదేళ్ల బాలికను అపహరించి చెరుకు తోటలోకి తీసుకెళ్లాడు. బాలిక కేక‌లు వేయడంతో.. బట్టలు విప్పి నోటిలో కుక్కాడు. ఆపై కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారం చేశాడు. రక్తంతో తడిసిన స్థితిలో బాలిక చేతులు, కాళ్లు కట్టివేసి నిందితుడు పరారయ్యాడు. గ్రామస్థులు మూడు గంటలపాటు వెతికి బాలికను గుర్తించారు. బాలిక‌ పరిస్థితి విషమంగా మారడంతో కంకరఖేడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

జాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక ఉదయం 6.30 గంటలకు మలవిసర్జన కోసం పొలాల్లోకి వెళ్లింది. ఏడు గంటల వరకు కూడా బాలిక తిరిగి రాలేదు. దీంతో కుటుంబీకులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. బాలిక కనిపించకపోవడంతో ఆలయంలో ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ ద్వారా గ్రామంలో ప్రకటన చేశారు. ఆ తర్వాత జనం గుమిగూడారు. అందరూ ఏకమై పొలాల్లో అమ్మాయి కోసం వెతకడం ప్రారంభించారు. ఉదయం.. పొలాల వైపు వెళ్తున్న వ్యక్తి గ్రామానికి చెందిన బాలికను అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత అందరూ అమ్మాయిని వెతకడానికి పొలాలోకి వెళ్లారు.

మూడు గంటలపాటు శ్రమించిన తర్వాత రోహ్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమానుల్లాపూర్ గ్రామంలోని చెరుకు తోటలో బాలిక 9.30 గంటలకు దొరికింది. బాలిక చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. నోటిలో గుడ్డలు కుక్కి ఉన్నాయి. వివస్త్రగా పడి ఉన్న బాలిక శ‌రీరం నుంచి రక్తం కారుతోంది. గ్రామ‌స్తులు క‌ట్లు విప్పిన త‌ర్వాత బాలిక తన బాధను వివరించింది. వెంట‌నే బాధిత‌ బాలికను గుడ్డలో చుట్టి గ్రామస్థులు రోహతా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి పోలీసులు సీహెచ్‌సీకి త‌ర‌లించారు. చేతులు, కాళ్లపై గుర్తులు ఉన్నాయి. గ్రామస్థులు కూడా నిందితుడు కోసం వెతకడం ప్రారంభించారు. అయితే నిందితుడు గ్రామంలో ఓ మహిళతో నివసిస్తున్న‌ట్లు చెబుతున్నారు. బాధిత‌ బాలిక ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది.

బాలికపై దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఘటన అనంతరం నిందితుడు గ్రామం విడిచి పారిపోయాడు. తన మొబైల్ కూడా స్విచాఫ్ చేశాడు. నిందితుడి కోసం ఎస్పీ కమలేష్ బహదూర్ పోలీసు బృందాన్ని రంగంలోకి దింపారు.

Updated On 1 Sep 2023 10:27 PM GMT
Yagnik

Yagnik

Next Story