మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో విషాదం నెలకొంది. కేసముద్రం తహసీల్దార్ గుండెపోటుతో మృతి చెందారు. కేసముధ్రం మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో తహసీల్దార్ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు కార్యక్రమం ముగిసిన అనంతరం తహశీల్దార్ ఫరీదుద్దీన్ ఇంటికి వెళ్లారు.
మహబూబాబాద్(Mahabubabad) జిల్లా కేసముద్రం(Kesamudram)లో విషాదం నెలకొంది. కేసముద్రం తహసీల్దార్ గుండెపోటుతో మృతి చెందారు. కేసముధ్రం మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందు(Iftar Party) కార్యక్రమంలో తహసీల్దార్ ఫరీదుద్దీన్ పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు కార్యక్రమం ముగిసిన అనంతరం తహశీల్దార్ ఫరీదుద్దీన్(Fariduddin) ఇంటికి వెళ్లారు. కొద్దిసేపటికే ఆయన గుండె పోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తహసీల్దార్ ఫరీదుద్దీన్ మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్(Shankar Naik) హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తమతోపాటు అప్పటివరకు కలిసిమెలిసి ఉన్న తహసిల్దార్ కొద్ది క్షణాల్లోనే మరణించడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. తహాసిల్దార్ ఫరీదుద్దీన్ స్వస్థలం హనుమకొండ(Hanamkonda). ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.