నిర్మానుష ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలను టార్గెట్ గా చేసుకొని కేరళ గ్యాంగ్ దాడులు చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఓ ముఠా కేరళ నుంచి విమానంలో వచ్చి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. నలుగురు సభ్యులు కేరళ నుంచి విమానంలో హైదరాబాద్‌కు వచ్చి నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలను టార్గెట్‌గా చేసుకొని
నిర్మానుష ప్రాంతాల్లో ఉన్న ఏటీఎం(ATM)లను టార్గెట్ గా చేసుకొని కేరళ గ్యాంగ్(Kerala Gang) దాడులు చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఓ ముఠా కేరళ నుంచి విమానం(Plane)లో వచ్చి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. నలుగురు సభ్యులు కేరళ నుంచి విమానంలో హైదరాబాద్(Hyderabad)కు వచ్చి నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంలను టార్గెట్‌గా చేసుకొని.. డబ్బులు డ్రా(Draw) చేయడానికి వచ్చిన వ్యక్తులపై పెప్పర్ స్ప్రే చల్లి డబ్బులు దోచుకుంటున్నారు.
పలు ప్రాంతాల్లో జరిగిన ఇటువంటి ఘటనలపై పోలీసుల(Police)కు బాధితులు ఫిర్యాదు చేశారు. దోమలగూడ(Domalguda)లో బాధితులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్(CCTV Footage)ను పరిశీలించి నలుగురు సభ్యుల ముఠా ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. వారు కేరళకు చెందినవారిగా కనుగొన్నారు. కేరళకు వెళ్లిన పోలీసులు నలుగురు సభ్యులు గల ఆ ముఠాను అరెస్టు చేసి హైదరాబాదుకు తీసుకువచ్చి రిమాండ్(Remand)కు తరలించారు.